Site icon HashtagU Telugu

Madhya pradesh : శ్రీరామనవమి వేడుకల్లో విషాదం, మెట్లబావి పైకప్పు కూలీ 12 మృతి

Mp

Mp

శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీ బెళేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో, కొంతమంది భక్తులు మెట్ల బావిలో పడిపోయారు. రెస్యూటీం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు సమాచారం. ఇండోర్‌లోని స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి సందర్భంగా పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. అదే సమయంలో మెట్ల బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది మెట్ల బావిలో పడిపోయారు.

ప్రస్తుతం క్షతగాత్రులను రక్షించే పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్ల బావి 40 అడుగుల లోతు ఉందని, దానిపై ఇనుప వల ఉందని తెలిపారు. ఇనుప మెష్‌పై స్లాబ్‌లు వేసి దీనిని నిర్మించారు. హవన సమయంలో మెట్లబావి పైకప్పుపై ఎక్కువ మంది ఉండటంతో మెష్ విరిగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. వీధులు ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. అంబులెన్స్‌, 108 వాహనం రాకపోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మెట్ల బావిలో పడిన కొంతమందిని ఎలాగోలా బయటకు తీశారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్, పరిపాలన బృందం ఇక్కడికి చేరుకుంది.

బావడీ ఘటనపై ప్రధాని మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “ఇండోర్‌లో జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది. సిఎం శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ, రిలీఫ్‌లో వేగంగా ముందుకు సాగుతోంది. బాధిత వారందరికీ, వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానంటూ అని ఆయన ట్వీట్ చేశారు.