టాయ్ ట్రైన్.. మళ్లీ వచ్చేస్తుదండీ..!

ఎన్ని రైళ్లలో ప్రయాణించినా కలగని అనుభూతి.. ఈ టాయ్ ట్రైన్ లో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు.. జీవితానికి సరిపడే మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు, కొండలు, గుట్టల మధ్య విహరించడమే ఈ రైలు ప్రత్యేకత.

  • Written By:
  • Updated On - October 26, 2021 / 11:51 AM IST

ఎన్ని రైళ్లలో ప్రయాణించినా కలగని అనుభూతి.. ఈ టాయ్ ట్రైన్ లో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు.. జీవితానికి సరిపడే మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు, కొండలు, గుట్టల మధ్య విహరించడమే ఈ రైలు ప్రత్యేకత. డార్జిలింగ్, ఊటీ వెళ్లినవాళ్లు ఈ టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఇష్టం చూపుతారు. ఇన్నాళ్లు కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ రైలు.. మళ్లీ పట్టాలపై పరుగులు తీస్తోంది. న్యూ జల్పాయిగురి- డార్జిలింగ్ నగరాల మధ్య టాయ్ ట్రైన్ పట్టాలెక్కింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల గత ఏడాది మార్చి 22వతేదీ నుంచి ఈ టాయ్ ట్రైన్ రాకపోకలను నిలిపివేశారు. కరోనా కేసుల సంఖ్య తగ్గడంతోపాటు ఏడాదిన్నర కాలం తర్వాత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజ ప్రారంభానికి ముందు ఈ టాయ్ ట్రైన్ మళ్లీ బుధవారం నుంచి రాకపోకలు సాగించింది.డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నడుపుతున్న టాయ్ ట్రైన్ ను యునెస్కో వరల్డ్ హెరిటైజ్ సైట్ గా ప్రకటించింది.

న్యూజల్పాయిగురి నుంచి డార్జిలింగ్ వరకు 88 కిలోమీటర్ల దూరం జర్నీ ఉంటుంది. ఈ రైల్వేలైన్ బ్రిటిష కాలంలోనే నిర్మితమైంది. టాయ్ ట్రైన్ ప్రయాణంలో ఎన్నో వాటర్ ఫాల్స్, సుందరమైన ప్రదేశాలు దర్శనమిస్తాయి. హిల్ స్టేషన్ రైల్వే సేవల పునర్ ప్రారంభంతో పర్యాటక రంగానికి ఊపు రానుంది.

ఊటీ ఈ పేరు వినగానే నీలగిరి కనుమల్లో ఎప్పుడూ అత్యంత చల్లగా ఉండే ప్రదేశం. వేసవిలో కూడా ఇక్కడ అత్యంత చల్లగా ఉంటుంది. వేసవితాపం తట్టుకోలేని వారు కొంతకాలం పాటు ఊటీ వెళ్తుంటారు. ఇక చలికాలంలో చలిని ఇష్టపడేవారు కూడా ఊటీ వెళ్తుంటారు. ఊటీ అనగానే అందరికీ టాయ్ ట్రైన్ గుర్తొస్తుంది. మెట్టుపాళ్యం-ఉదగమండలం(ఊటీ) రూట్‌లో ఈ రైలు పరుగులు తీస్తూ ఉంటుంది. ఊటీ వెళ్లేవారు తప్పకుండా ఈ రైలు ప్రయాణం ఆస్వాదించాలని అనుకుంటారు.  కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ పరుగులు తీయనుంది.