Site icon HashtagU Telugu

Crucial Constituencies: ఆ స్థానాల్లో హై ఓల్టేజ్ ఫైట్ ఖాయం..!

Crucial Constituencies

Resizeimagesize (1280 X 720) (1)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. కీలక నేతలు పోటీచేస్తున్న హైవోల్టేజ్ సీట్స్‌ (Crucial Constituencies)పై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. కన్నడ నాట ప్రముఖులు పోటీచేస్తోన్న నియోజకవర్గాలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి పోటీచేస్తున్నారు సీఎం బొమ్మై. 2008లో 12వేలు, 2013లో 9,600, 2018లో 9,200 మెజారిటీతో గట్టెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ గట్టి పోటీఇస్తున్నారు. బొమ్మైకు లింగాయత్ ఓటర్ల బలముంటే.. పఠాన్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు.

కాంగ్రెస్ కీలక నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం మైసూరు జిల్లాలోని వరుణ. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బాదామికి మారిన సిద్ధ.. ఇప్పుడు మళ్లీ వరుణకు వచ్చారు. సిద్ధరామయ్యకు పోటీగా మంత్రి V సోమణ్ణను నిలబెట్టింది బీజేపీ హైకమాండ్‌. సోమణ్ణ స్థానికంగా బలమైన నాయకుడే కానీ, సిద్ధరామయ్యను ఓడించడం మాత్రం కష్టమే. కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎదురులేదు. ఇక్కడ కాంగ్రెస్- జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. ఈసారి మాత్రం గట్టిగా ఎదురుదాడి చేస్తోంది బీజేపీ.

Also Read: Mary Kom: నా రాష్ట్రం తగలబడుతోంది.. కాపాడండి.. ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఆవేదన

వొక్కళిగల్లో పట్టున్న మంత్రి ఆర్‌, అశోకాను రంగంలోకి దించింది. ఇద్దరూ సమఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ముందుజాగ్రత్తగా రెండుస్థానాల నుంచి బరిలోకి దిగారు. ఆర్‌. అశోకా జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బరిలో నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతం బీజేపీ తరపున పోటీచేస్తున్న సీపీ యోగేశ్వర్‌.. 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కుమారస్వామి కొడుకు కోసం సీటు త్యాగం చేశారు కుమారస్వామి సతీమణి అనిత. రామనగర నుంచి తనయుడు నిఖిల్ గౌడను నిలబెట్టారు.

ఇక్కడ 2004 నుంచి 4సార్లు కుమారస్వామి గెలిస్తే.. 2013లో అనిత విజయం సాధించారు. ఈసారి నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు. దంపతులిద్దరూ కొడుకు కోసం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది జేడీఎస్ కంచుకోట కాబట్టి నిఖిల్‌ విజయం లాంఛనమే. కర్మాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఎన్నికల రాజకీయానికి గుడ్‌బై చెప్పారు. తన స్థానంలో కొడుకు బీవై విజయేంద్రను బరిలోకి దించారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప అన్నిసార్లూ గెలిచారు యడియూరప్ప. వారసుడి గెలుపు నల్లేరుపై నడకే. మెజార్టీ ఎంత అనేదే చర్చ. మే 13న ఈ లెక్క తేలిపోనుంది.