Site icon HashtagU Telugu

Solar Eclipse : డిసెంబ‌ర్ 3,4 తేదీల్లో గ్ర‌హ‌ణ ప్ర‌భావం

Solar Eclipse

Solar Eclipse

డిసెంబ‌ర్ 3, 4 తేదీల్లో ఆకాశంలో అరుదైన సంఘ‌ట‌న జ‌ర‌గ‌బోతుంది. ఈ ఏడాది చివ‌రి గ్ర‌హ‌ణం డిసెంబ‌ర్ 4న ఏర్ప‌డుతోంది. డిసెంబ‌ర్ 4న భూమి, చంద్రుడు మ‌ధ్య‌కు సూర్యుడు రాబోతున్నాడు. ఫ‌లితంగా సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌బోతుంది. రాత్రి వేళ ఆకాశంలో శని, శుక్రుడిని బృహస్పతి ప‌ట్టుకోనుంది ఫ‌లితంగా ఖ‌గోళంలో కొన్ని సంఘటనలు జ‌రిగే అవ‌కాశం ఉంది. సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం, సూప‌ర్ న్యూ మూన్ ల‌ను కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే డిసెంబ‌ర్ 3, 4 తేదీల్లో చూడ‌బోతున్నాం.డిసెంబర్ 3 నుంచి సూపర్ అమావాస్య రూపుదిద్దుకోనుంది. డిసెంబర్ 4 గ్రహణం రానుంది. సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు కదులుతున్నప్పుడు, భూమిపై నీడను వేస్తూ, కొన్ని ప్రాంతాలలో సూర్యుని కాంతిని పూర్తిగా లేదా పాక్షికంగా నిరోధించ‌నుంది.

సూర్యగ్రహణం మొదటి నుండి చివరి వరకు ఐదు వేర్వేరు దశలను కలిగి ఉంటుంది. మొదటి దశ సూర్యుని ఉప‌రిత‌లంపై చంద్రుడు నీడ ప‌డిన‌ప్పుడు పాక్షిక గ్రహణం ప్రారంభమవుతుంది. రెండవ దశ చంద్రుడు సూర్యుని మొత్తం ఉప‌రితలం కవర్ చేసినప్పుడు సంపూర్ణ గ్రహణం. గ్రహణం యొక్క మూడవ దశ చంద్రుడు సూర్యుని ఉప‌రిత‌లంను పూర్తిగా కప్పినప్పుడు గ‌రిష్ట గ్రహణం ఏర్ప‌డుతుంది.సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. డిసెంబర్ 4 సంపూర్ణ సూర్యగ్రహణం ఉదయం 10:59 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్తి గ్రహణం మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు కనిపిస్తుంది. గరిష్ట గ్రహణం మధ్యాహ్నం 01:03 గంటలకు కనిపిస్తుంది. గ్ర‌హ‌ణం మధ్యాహ్నం 3:07 గంటలకు ముగుస్తుంది.

దక్షిణ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది.
సంపూర్ణ సూర్యగ్రహణం డిసెంబర్ 4న సంభవిస్తుంది. డిసెంబర్ 3, 4 తేదీల్లో రాత్రిపూట ఆకాశంలో సూపర్ న్యూ మూన్‌ను గమనించవ‌చ్చు.
అమావాస్య పగటిపూట ఆకాశంలో ఉంటుంది. సూర్యునికి అదే సమయంలో ఉదయించడం, అస్తమించడం వలన పెద్ద కాంతికి దారి తీస్తుంది, ఇది కంటితో చూడటం కష్టమవుతుంది.

Exit mobile version