General Election 2024 : దేశంలో మొత్తం రూ.96.88 కోట్లు ఓటర్లు – CEC రాజీవ్ కుమార్

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Total Number Of Voters In T

Total Number Of Voters In T

లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ (General Election 2024) కు సంబదించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) తెలియజేస్తున్నారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కు సంబదించిన వివరాలను మీడియా కు తెలియజేసారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.

దేశంలో మొత్తం రూ.96.88 కోట్లు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు, యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు, తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు, దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు, 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82 లక్షలు, 100 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 2.18 లక్షలు, సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు, ట్రాన్స్ జెండర్లు 48,000 ఉన్నట్లు పేర్కొన్నారు.

Read Also : Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్

  Last Updated: 16 Mar 2024, 03:41 PM IST