Site icon HashtagU Telugu

Operation Kagar : 20 ఏళ్లకే మావోయిస్టు గా మారిన యువతీ..కట్ చేస్తే రూ.14 లక్షల రివార్డు

Maoist Sunitha Surrender

Maoist Sunitha Surrender

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్‌ లక్ష్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడం, అరణ్యప్రాంతాల్లో దాగి ఉన్న అతి దుర్మార్గ మావోయిస్టు నాయకులను అణచివేయడం. ఈ నేపథ్యంలో అనేకమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతూ, సాధారణ జీవనంలోకి తిరిగి రావడానికి ముందడుగు వేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మావోయిస్టు సునీత (23) మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఎదుట లొంగిపోయారు.

Karthika Masam: కార్తీక మాసం ఎఫెక్ట్ తో ఆలయాల్లో రద్దీ..భక్తులు జాగ్రత్త

సునీత చిన్న వయసులోనే ఎర్రదళంలో చేరారు. కేవలం 20 ఏళ్లకే మావోయిస్టు దళంలో చేరి, అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పార్టీ సెంట్రల్ కమిటీ సీనియర్ నాయకుడు రామ్ దర్‌కు బాడీగార్డ్‌గా వ్యవహరించిన ఆమె, అడవుల్లో భద్రతా బలగాలపై జరిగిన పలు దాడులకు ప్రణాళికా కర్తగా నిలిచారని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆమెపై రూ.14 లక్షల రివార్డ్ ప్రకటించబడింది. మావోయిస్టు దళంలో దశాబ్దం పాటు గడిపిన సునీత, చివరకు ప్రభుత్వ పిలుపుకు స్పందించి, హింస మార్గం వదిలి సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు ముందుకొచ్చారు.

మధ్యప్రదేశ్‌లో కొత్త మావోయిస్టు లొంగుబాటు విధానం (సరెండర్ పాలసీ) అమల్లోకి వచ్చిన తరువాత ఇది మొదటి లొంగుబాటు. ఈ పాలసీ ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు భద్రతతో పాటు పునరావాసం, విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం వంటి అనేక రకాల సదుపాయాలు కల్పించబడుతున్నాయి. దీంతో మావోయిస్టులు ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. భద్రతా దళాల సమన్వయ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక చైతన్యం ఇవన్నీ కలసి మావోయిస్టు ప్రభావం క్రమంగా తగ్గిపోతున్న సూచనలుగా కనిపిస్తున్నాయి. సునీత లొంగుబాటు, ఆపరేషన్ కగార్ విజయానికి మరో మైలురాయిగా భావిస్తున్నారు.

Exit mobile version