Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు

రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.

Top News Today: రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.

మనుషుల మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో కీలక ముందుడుగు పడింది.తొలిసారి ఓ వ్యక్తి మెదడుకు విజయవంతంగా వైర్‌లెస్ చిప్‌ను అమర్చామని, ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని.ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు.

తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్​లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు.

ఏపీలో భారీగా ఐపీఎస్‌బదిలీ అయ్యారు.ఎన్నికల నేపథ్యంలో 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. తెలంగాణలో ఖాళీ కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది.

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ అయేషాను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు.

డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. స్వాతి పత్రికలో వచ్చిన కథను కాపీ చేసి శ్రీమంతుడిని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే.

కోహ్లీ నాపై ఉమ్మేశాడు వేశాడంటూ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి 2015లో భార‌త గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ డీన్ ఎల్గ‌ర్ పై ఉమ్మి వేశాడట. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో డీన్ విషయన్నీ వెల్లడించాడు.

గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 100 పెరిగి 57,800కి చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల గోల్డ్ పై 100 పెరిగి 63,050 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండిపై .200 పెరిగింది. దీంతో కిలో వెండి 77,700 గా నమోదైంది.

Also Read: PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం