Site icon HashtagU Telugu

Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు

Top Today News

Top Today News

Top News Today: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా మధురవాడలో తహసీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయనను తన ఇంట్లోనే దుండగులు హతమార్చారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.

జియో, ఎయిర్‌‌టెల్ తర్వాత ఎక్కువ మంది యూజర్లు ఉన్న వొడాఫోన్-ఐడియా కంపెనీ త్వరలో 5G సర్వీసులను ప్రారంభించనుంది. వచ్చే ఐదారు నెలల్లో ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వొడాఫోన్-ఐడియా CEO అక్షయ్ మూండ్రా ప్రకటించారు.

ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకున్నావచ్చే ఒకటి రెండు లోక్‌సభ సీట్లు పెద్దగా లెక్కలోకి రావు.సో ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

వైసీపీ ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితా విడుదలైంది. ఇందులో 4 లోక్ సభ, 6 అసెంబ్లీ ఇంఛార్జ్ లు ఉన్నారు. మొత్తంగా 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ లను మార్చేసింది.

భారత్‌ రైస్‌ పేరిట 29 రూపాయలకే బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి రెండో వారం నుంచి 29 రూపాయలకే బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

హనుమాన్ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మూడు వారాల్లోనే 300 కోట్ల కలెక్షన్లతో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలిచింది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. 18 ఫోర్లు, 7 సిక్సులతో 277 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు.

22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై 150 పెరిగి 58,300కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై 160 పెరగడంతో 63,600 వద్ద కొనసాగుతుంది. కిలో వెండిపై 300 పెరిగి 76,800 వద్ద ట్రెండ్ వుతుంది.

Also Read: V. Hanumantha Rao: సీఎం జగన్ పై హనుమంతరావు ఫైర్, జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యలు