Site icon HashtagU Telugu

Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు

Top News Today

Top News Today

Top News Today: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది. యశోద హాస్పిటల్ వైద్యులు కేసీఆర్ కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. కేసీఆర్‌ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయిన విషయం తెలిసిందే.

తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడినునుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీలోని ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇవాళ ఆమె పుట్టినరోజును తెలంగాణ కాంగ్రెస్‌ గ్రాండ్‌గా నిర్వహించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హస్తం పార్టీ సోనియాగాంధీకి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చింది.

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు ఉద్యమకారులకు సంబంధించిన కేసుల వివరాలను అందించాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు.

ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం మొదలవుతుంది.

ఇరాక్‌లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.

డబుల్ ఓట్, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓ వ్యక్తికి ఒకే రాష్ట్రం, ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలని స్పష్టం చేసింది. వైసీపీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది. అయితే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి 77,200వద్ద కొనసాగుతోంది.

Also Read: Pain Relief Tips : మోకాళ్ళు, నడుము, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే చాలు నొప్పి మాయం అవ్వాల్సిందే?

Exit mobile version