మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో కీలక మలుపు తిరిగింది. దశాబ్దాలుగా అరణ్యాల్లో తుపాకీతో తిరిగిన అగ్ర మావోయిస్టు కమాండర్లు ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన నేపథ్యంలో, ఇవాళ మరో ప్రముఖ నాయకుడు ఆశన్న (తక్కళ్లపల్లి వాసుదేవరావు) కూడా అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. గత 25 ఏళ్లుగా మావోయిస్టు సాయుధ పోరాటంలో కీలక వ్యూహకర్తగా, ప్లానర్‌గా పనిచేసిన ఆయన లొంగిపోవడం ఆర్గనైజేషన్‌కు తీవ్ర దెబ్బగా భావిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ఆపరేషన్లు, దాడులు జరిగాయని పోలీసులు వెల్లడిస్తున్నారు.
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్
ఆశన్న పేరు 1990ల చివర్లో, 2000వ దశక ఆరంభంలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడు, ఆశన్న పార్టీ వ్యూహరచనలో ప్రధానపాత్ర పోషించారు. ముఖ్యంగా 1999లో IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్య, 2000లో అప్పటి రాష్ట్ర హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు సమాచారం. అంతకుముందు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీద జరిగిన బాంబు దాడుల్లో కూడా ఆయన వ్యూహాత్మకంగా పాల్గొన్నారని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల సంవత్సరాల్లో పోలీసుల ఒత్తిడి, ఆర్గనైజేషన్ అంతర్గత విభేదాలు, పాత స్ఫూర్తి కోల్పోవడం వంటి కారణాల వల్ల మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆశన్న వంటి టాప్ కమాండర్లు సరెండర్ అవ్వడం వల్ల మావోయిస్టు చలనం పూర్తిగా క్షీణించనుందనే విశ్లేషణ ఉంది. ప్రభుత్వం పునరావాస పథకాల ద్వారా లొంగిపోయిన మావోయిస్టులను సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై దృష్టి పెడుతోంది. ఈ పరిణామంతో దశాబ్దాలుగా అరణ్యాల మధ్య సాగిన ఎర్రదళ పోరాటం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
