Site icon HashtagU Telugu

Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు

Top Today News

Top Today News

Today Top News: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఏపీ కారంపూడిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ విద్యార్థినికి తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఆ విద్యార్థిని ఒక్కసారిగా షాక్ కు గురైంది.

దేశంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్​కు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.అలాగే ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మంగళవారం వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

మేమంతా సిద్ధం పేరుతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ నెల 27 నుంచి బస్సుయాత్ర చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ యాత్ర 27 నుంచి 21 రోజుల పాటు కొనసాగనుంది.

ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టును ఆశ్రయించారు కేఏ పాల్. ఏప్రిల్ లో ఎలక్షన్స్ నిర్వహించి మేలో ఓట్ల లెక్కింపెంటని ప్రశ్నించారు. 21 రోజుల గ్యాప్ లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశాడు కేఏ పాల్.

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాతో రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా ఎవరొస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను తెలంగాణకు తాత్కాలిక గవర్నర్ గా నియమించే అవకాశం ఉంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలకమని తేల్చేసింది ఈడీ. ఆమ్ ఆద్మీ పార్టీకి కల్వకుంట్ల కవిత 100 కోట్ల ముడుపులు అందించిందని ఈడీ పేర్కొంది. కాగా కవితా పిటిషన్ పై సుప్రీం ఈ రోజు విచారించనుంది.

సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సంచలనం రేపింది. అంతేకాదు 2024లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా జీ5ను నిలబెట్టింది.

బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్​లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,370 కాగా 24క్యారెట్ల బంగారం ధర 65,860కి చేరింది. మరోవైపు కేజీ వెండి 79,900 కు లభిస్తుంది.

ఎన్‌సీఏ నుంచి కేఎల్‌ రాహుల్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ రేపు మార్చి 20న లక్నో జట్టుతో చేరనున్నాడు. లక్నో తొలి మ్యాచ్‌ను మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

Also Read: Pooja Hegde: పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. బాలీవుడ్ అవకాశాలు కొట్టేసిన ముద్దుగుమ్మ?

Exit mobile version