Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.

Top News Today: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు.

పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసుల సిట్ బృందం విచారించనున్నారు.

కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బిజెపి ఎంపి వి శ్రీనివాస్ ప్రసాద్ గత 4 రోజులుగా బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 9 మంది మరణించారు, 23 మంది గాయపడ్డారు.

పర్యాటకులతో నిండిన క్యాబ్ జమ్మూ మరియు కాశ్మీర్‌లోని సింధ్ నదిలో పడింది, 5 మంది మరణించారు. ఇందులో 3 మంది రక్షించబడ్డారు. ఒకరు తప్పిపోయారు.

మణిపూర్‌లోని 6 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 30 న మళ్లీ ఓటింగ్ నిర్వహించబడుతుంది, ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ఇప్పుడు ఆ దేశానికి ఉప ప్రధానమంత్రి కానున్నారు.

సుడిగాలి దక్షిణ చైనాలో విధ్వంసం సృష్టించింది. ఇప్పటివరకు 5 మంది మరణించారు, సుమారు 33 మంది గాయపడ్డారు.

Also Read; Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి