Today Top News: మర్చి 2న టాప్ న్యూస్

గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Top Today News

Top Today News

Today Top News: గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో రికార్డుల్లోకెక్కింది.బ్లూమ్‌బర్గ్ సర్వేలో మొనాకో రిచెస్ట్ సిటీగా నిలిచింది. అక్కడ 172 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయాలంటే 8 కోట్లు ఖర్చు చేయాల్సిందేనని .బ్లూమ్‌బర్గ్ నివేదించింది.

బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్​లో జరిగిన ప్రమాదాన్ని బాంబు పేలుడుగా తేల్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య . ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర డీజీపీ అలోక్‌ మోహన్‌ తెలిపారు. ఈ పేలుడు గురించి ఎన్​ఐఏ, ఐబీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు డీజీపీ వెల్లడించారు.

అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలపై హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రోడ్డుమ్యాప్‌తో వస్తే ఒక్క నిమిషంలో ఫైలుపై సంతకం చేస్తానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు

జీహెచ్‌ఎంసీ పేరు మారబోతుంది. జిహెచ్ఎంసీని గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌ గా మార్చేలా రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తోంది.

రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ టెస్ట్ కోసం ఆయన నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే అరెస్ట్ తప్పదంటున్నారు.

విమెన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా తలపడనున్నారు.

పవన్‌కి కటీఫ్ చెప్పేందుకు కమలం పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు గుడ్ బై చెప్పి 175 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఎన్టీఆర్ భార్యతో కలిసి బెంగుళూరులో సందడి చేశాడు. బెంగుళూరులో ఎన్టీఆర్.ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత కలుసుకున్నారు. దీంతో ఈ సమావేశంపై సర్వత్రి ఆసక్తి నెలకొంది.

తులం బంగారంపై 10 రూపాయలు పెరగడంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,910 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 63,170 వద్ద నమోదైంది. మరోవైపు కేజీ వెండిపై 100 పెరగింది. దీంతో కిలో వెండి 74,600కి చేరుకుంది.

Also Read: Modi Cabinet Meet: రేపు ప్రధాని మోదీ చివరి మంత్రివర్గ భేటీ

  Last Updated: 02 Mar 2024, 05:57 PM IST