Top News Today: టుడే టాప్ న్యూస్ తెలుగు

మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపిలు హాల్ లోనే కొట్టుకున్నారు.

Top News Today: మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపిలు హాల్ లోనే కొట్టుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రకాష్ గౌడ్ తాజాగా స్పందించి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

వరంగల్‌లో ఓ గ్యాస్‌ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ బదులు నీరు వస్తుందని లబోదిబోమన్నాడు.వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో బాధితుడు ఆకుల సత్యం ఫిర్యాదు మేరకు అధికారులు విచారిస్తున్నారు.

బీహార్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. ఆపై ఎన్డీయే కూటమితో జతకట్టి తొమ్మిదో సారి సీఎంగా ప్రమాణం చేశాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వస్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు

ఏపీలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అంతకుముందు ఎల్లుండి ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ఓటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది.

అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రామ మందిరానికి సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. అందుకనుగుణంగా ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కొనుగోలు చేశారు.

తెలంగాణలో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ధీమా వ్యక్తంచేశారు.

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకొన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

గుంటూరు కారం మూవీ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ సుదర్శన్ థియేటర్లో అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఇంగ్లండ్‍తో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన తర్వాత అనూహ్యంగా భారత్ ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది.27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విండీస్ జట్టు టెస్టు మ్యాచ్ గెలిచింది.

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. రెండ్రోజులుగా పెరిగిన బంగారం ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 కాగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,950 వ‌ద్ద కొన‌సాగుతోంది. అటు వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 77,500 గా నమోదైంది.

Also Read: Ayodhya : భారీ భూకంపం వచ్చిన అయోధ్య రామమందిరానికి ఏమీకాదు..ఎందుకంటే ..!!