Site icon HashtagU Telugu

Today Top News: దేశంలో జరిగిన ముఖ్యమైన వార్తలు

Top Today News

Top Today News

Today Top News: ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ మావనేంద్ర సింగ్‌, మరియు ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా.. మానవేంద్ర సింగ్‌ భార్య చైత్రా సింగ్‌ స్పాట్‌లోనే చనిపోయారు.

దేవాలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశం నిషేధించాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు దేవాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాల్లో హిందూయేతరులు ధ్వజస్తంభం దాటి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించాలని తెలిపింది.

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా.. మరో 18మందికి గాయాలయ్యాయి.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్య పత్రాలను అక్రమంగా చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు తీర్పునిచ్చింది.

రేపు గురువారం కేసీఆర్ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి జిల్లా అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది.

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రం విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ప్రస్తుతం ఐసీయూలో చికిత్సతీసుకుంటున్నాడు. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న క్రమంలో తన సీట్లో వాటర్ బాటిల్‌ కు బదులు యాసిడ్ బాటిల్ పెట్టారని.. ఆ విషయాన్ని గమనించని మయాంక్ ..మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగడనీ, దీంతో అతడు అస్వస్థతకు గురై ఉంటారనే ప్రచారం జరుగుతోంది

బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 200 పెరిగి 58,000 చేరుకుంది. అలాగే కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 220 పెరిగి 63,270 వద్ద కొనసాగుతుంది. మ‌రోవైపు వెండి ధ‌ర కూడా పెరిగింది. కిలో వెండిపై 300 పెరిగింది. దీంతో కిలో వెండి 78,000 చేరింది.

Also Read: Hyderabad: ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ