Today Top News: 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను ఈ రోజు ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో 3 లేదా 4 రూపాయలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాభాల మాట అటు ఉంచితే మార్కెట్ కు తరలించిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు.
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన మాజి ముఖ్యమంత్రి కేసిఅర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో అసెంబ్లీకి చేరుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి రేపు రెండు గ్యారంటీలను అమలు చేయనున్నారు. మహిళలకి ప్రతినెల 2,500 నగదు బదిలీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇందరమ్మ ఇండ్ల నిర్మాణానికి .5 లక్షల సాయం పథకాల్లో రెండింటిని అమలు చేస్తారు.
పేదలకు సొంతింటి కలను సాకారం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అయితే ఇళ్లపై లబ్దిదారులకు పూర్తిహక్కు కల్పించేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టింది. 15 రోజుల వ్యవధిలో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకొంది
హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని ఆమె ఫుడ్ పాయింట్‌ను పోలీసులు మూసేయించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఫుడ్ పాయింట్‌ను కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను సీఎం ఆదేశించారు.
నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,000 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 63,270 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో 78,000 నమోదైంది.
Also Read: CM Revanth Reddy : రేపు మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ప్రకటన..?