NDA Big Meet : ఎన్డీఏ కూటమి ఇవాళ సాయంత్రం ఢిల్లీలో భేటీ కాబోతోంది. దీనికి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెల్లడించారు. ఈ కీలకమైన మీటింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. ఈసారి కొత్తగా ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వారిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఉండటం గమనార్హం. NDAలో చేరేందుకు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంగీకరించారు. ఆయన కూడా ఈ మీటింగ్ లో(NDA Big Meet) పాల్గొననున్నారు.
Also read : Deepika Padukone: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
ఈ మీటింగ్ కు హాజరయ్యే పార్టీల లిస్టులో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన, కేరళ కాంగ్రెస్ (థామస్) నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ వర్గం, ఏఐఏడీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఉపేంద్ర సింగ్ కుష్వాహా), వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (ముఖేష్ సహానీ), హిందుస్థానీ అవామ్ మోర్చా(జితన్ రామ్ మాంఝీ), NPP (నేషనల్ పీపుల్స్ పార్టీ మేఘాలయ), NDPP (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ), SKM (సిక్కిం క్రాంతికారి మోర్చా), MNF (మిజో నేషనల్ ఫ్రంట్), ITFT (త్రిపుర), BPP (బోడో పీపుల్స్ పార్టీ), AGP (PAs) పరిషత్ కూడా ఉన్నాయి.
మాజీ మిత్రపక్షాలు ఎన్డీఏలోకి మళ్లుతున్నాయా?
బీజేపీ మాజీ మిత్రపక్షాలైన అకాలీదళ్, తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏలోకి తిరిగి వస్తాయా అని అడిగిన ప్రశ్నకు బీజేపీ చీఫ్ నడ్డా బదులిస్తూ.. “అది వారి ఇష్టం. గతంలో మా పార్టీతో పొత్తును విడిచిపెట్టే నిర్ణయం తీసుకున్నది వాళ్ళే. ఎన్‌డీఏను వదిలి వెళ్ళమని మేం ఎప్పుడూ వాళ్లకు చెప్పలేదు” అని చెప్పారు.
Also read : Monsoon Session: 23 రోజుల పాటు కొనసాగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!