Site icon HashtagU Telugu

Pragyan – Vikram – Wake Up : చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ మేల్కొనేది నేడే.. అంతటా ఉత్కంఠ

Vikram Lander Clicked

Vikram Lander Clicked

Pragyan – Vikram – Wake Up : ఈరోజు అందరి చూపు.. ఇస్రో వైపే ఉంది !! ‘చంద్రయాన్ – 3’ మిషన్ లో భాగంగా రూ.650  కోట్ల బడ్జెట్ తో మన దేశం చంద్రుడిపైకి పంపిన ల్యాండర్  విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్  14 రోజులు పనిచేసి స్లీప్ మోడ్ లోకి వెళ్లాయి. చంద్రుడిపై ఒక్క రాత్రి అనేది 14 రోజులకు సమానం. రాత్రివేళ చంద్రుడిపై గడ్డకట్టేలా చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో ల్యాండర్ , రోవర్ లలోని పరికరాలు పనిచేయలేవు. అందుకే వాటిని ఇస్రో సైంటిస్టులు గత 14 రోజులుగా స్లీప్ మోడ్ లో పెట్టారు. ఈరోజు మళ్లీ చంద్రుడిపై తెల్లవారుతోంది. అంటే.. చంద్రుడిపై సూర్య కాంతి పడటం మొదలవుతోంది. ల్యాండర్ లో రెండు బ్యాటరీలు ఉన్నాయి. అవి సూర్యకాంతిలో పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి. ఇందులోని రిసీవర్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి.

Also read : Karnataka : వచ్చే ఏడాది ఫిబ్రవరికి ప్రారంభంకానున్న విజయపుర విమానాశ్రయం

ఈ తరుణంలో ఇస్రో సైంటిస్టులు ల్యాండర్  విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్  లను నిద్రలేపి.. వాటిని యాక్టివేట్ చేస్తారు. సూర్యకాంతిని వినియోగించుకొని వాటిలోని సోలార్ బ్యాటరీలు రీఛార్జ్ అయ్యేలా చేస్తారు. ఆ శక్తిని వాడుకొని ల్యాండర్, రోవర్ లు చంద్రుడిపై తమ యాక్టివిటీని కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. దీనిపై ఈరోజు  సాయంత్రంకల్లా ఇస్రో నుంచి ఏదైనా అధికారిక అప్ డేట్ వెలువడే అవకాశం ఉంది. దీనికోసమే ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మన చంద్రయాన్ -3 ల్యాండర్, రోవర్లు నిద్రలేచి జాబిల్లిపై రీసెర్చ్ ను మొదలుపెడితే ఇంకా కొత్తకొత్త విషయాలు (Pragyan – Vikram – Wake Up) వెలుగుచూసే అవకాశాలు ఉంటాయని శాస్త్రవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.