Site icon HashtagU Telugu

Loan: లోన్‌ ఐటీఆర్‌ లేకుండా పొందాలంటే..ఇలా !

Mudra Loans

Mudra Loans

లోన్ (Loan) కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత మీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి కొన్ని పత్రాలను కోరతారు. వాటిలో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ముఖ్యమైనది. ముఖ్యంగా పెద్ద రుణాలకు ఇది తప్పనిసరి. వేతన జీవులకు ITR ఉంటుంది. కానీ, స్వయం ఉపాధిలో ఉన్నవారు.. వార్షిక ఆదాయ పన్ను పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు ఐటీఆర్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్‌ లేకుండానే లోన్‌ పొందడం ఇలా !..

పర్సనల్‌ లోన్‌ (Personal Loan):

ఐటీఆర్‌ లేకుండా రుణం పొందేందుకు ఉన్న తేలికైన మార్గం పర్సనల్‌ లోన్‌. ఎలాంటి తనఖా లేకుండానే రుణం పొందొచ్చు. ఈ రుణాలు ప్రాథమికంగా దరఖాస్తుదారు ఆదాయం, KYC వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు. కొన్ని బ్యాంకులు కనీస ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండి, గతంలో ఎటువంటి ఎగవేతలు లేకుండా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. వేతన జీవులైతే బ్యాంకు ఖాతాను ఆధారంగా చేసుకొని సులువుగానే రుణం పొందొచ్చు. ఖాతాలోకి నిధుల ప్రవాహాన్ని బట్టి సంస్థలు లోన్‌ను మంజూరు చేస్తాయి.

మీకు ITR లేకపోతే, ప్రత్యేకించి మీరు స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే, ITR లేదా ఇతర ఆదాయ మార్గాల రుజువులతో సహ-దరఖాస్తుదారుడితో ఉమ్మడి రుణం కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా జాయింట్‌గా రుణం తీసుకుంటే బ్యాంకులు ఇద్దరి ఆదాయాన్ని కలిపి పరిగణనలోకి తీసుకుంటాయి. ఫలితంగా ప్రధాన దరఖాస్తుదారు మొత్తం రుణ అర్హత మెరుగుపడుతుంది.
బ్యాంకులు కొన్నిసార్లు ప్రత్యేక స్కీమ్‌లను ఆఫర్‌ చేస్తుంటాయి. కొంతమంది ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఎటువంటి పత్రాలు లేకుండానే రుణాలను అందిస్తాయి. నిర్దేశించిన అర్హతలు ఉంటే సరిపోతుంది.

ఇవి ITR లేకుండా అవసరమైన లోన్‌ను పొందడంలో సహాయపడే కొన్ని చిట్కాలు.. కానీ, సంస్థలు, బ్యాంకులను బట్టి నిబంధనలు మారొచ్చు. కాబట్టి రుణం తీసుకోవడానికి ముందు ఆయా బ్యాంకుల నిబంధనల్ని క్షుణ్నంగా పరిశీలించండి.

Also Read:  EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు పదే పదే క్లెయిమ్ తిరస్కరణలకు చెక్‌..!

Exit mobile version