TMC Manifesto 2024 : టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్

మేనిఫెస్టో లో ప్రధానంగా పేద కుటుంబాల‌కు ఏటా ప‌ది ఉచిత వంటగ్యాస్ సిలిండ‌ర్లు, ప్ర‌తి నెలా ఐదు కిలోల ఉచిత రేష‌న్‌, రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వంటి కీలక హామీల‌ను ప్రకటించింది

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 08:29 PM IST

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) తమ మేనిఫెస్టో (TMC election manifesto) ను రిలీజ్ చేసింది. మేనిఫెస్టో లో ప్రధానంగా పేద కుటుంబాల‌కు ఏటా ప‌ది ఉచిత వంటగ్యాస్ సిలిండ‌ర్లు, ప్ర‌తి నెలా ఐదు కిలోల ఉచిత రేష‌న్‌, రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వంటి కీలక హామీల‌ను ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేస్తామ‌ని, అంత‌ర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల‌ను త‌ట్టుకునేలా ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చింది. ఉపాధి హామీ కార్డుదారులంద‌రికీ 100 రోజుల ప‌ని గ్యారంటీని అమ‌లు చేస్తామ‌ని, ఉన్న‌త విద్యా స్కాల‌ర్ షిప్‌ల సంఖ్య‌ను మూడింత‌లు చేస్తామ‌ని మేనిఫెస్టోలో పొందుప‌రిచింది.

We’re now on WhatsApp. Click to Join.

* వృద్ధాప్య ఫించ‌న్ల‌ను నెల‌కు రూ. 1000కి పెంపు
* పేద కుటుంబాల‌కు ఇళ్ల నిర్మాణం
* ఉద్యోగాలకు భరోసా
* యూనివర్శల్ హౌసింగ్
* ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు
* రైతులకు కనీస మద్దతు ధర
* ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
* పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు తదితర హామీలను ప్రకటించింది.

ఈ సందర్బంగా మమతా మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేస్తాం. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్‌ క్యాంపుగా మార్చేసింది’ అని పేర్కొన్నారు.

Read Also : T.BJP : గ్రేటర్‌ హైదరాబాద్‌, దక్షిణ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కష్టమేనా..?