TMC Rajya Sabha MP Resignation : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ కూడా దీదీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు అందుకు గల కారణాలను వివరిస్తూ మమతా బెనర్జీకి సంచలన లేఖ రాశారు.
Also Read :Actor Vijay Political Party : పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయింది.. ఎన్నికలకు రెడీ : నటుడు విజయ్
‘‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగానే నేను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశాను. ఈ కేసు విషయంలో మా పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీరు సరిగ్గా లేదు. టీఎంసీలో అస్మదీయులు, అవినీతిపరులకు పెద్దపీట వేస్తున్నారు. వాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది’’ అని సీఎం దీదీకి రాసిన లేఖలో జవహర్ సిర్కార్(TMC Rajya Sabha MP Resignation) పేర్కొన్నారు. ‘‘అవినీతిపై టీఎంసీ ప్రభుత్వానికి ఆందోళన లేదు. ఒక వర్గం నాయకులు మిగిలిన వారిని అణగదొక్కుతున్నారు. అవన్నీ చూసి నాకున్న భ్రమలు తొలగాయి. అవినీతి అధికారులకు ప్రమోషన్ల ఇచ్చే కల్చర్‌ను నేను సపోర్ట్ చేయలేను. టీఎంసీ పార్టీలో ఇలాంటి దుస్థితిని గతంలో ఎన్నడూ నేను చూడలేదు’’ అని లేఖలో ఆయన ప్రస్తావించారు.
Also Read :Moving Ganesh : కన్నుల పండుగ చేస్తున్న కదిలే వినాయకుడు.. 36వేల ముత్యాలతో…
‘‘ఆర్జీ కర్ ఆస్పత్రిలో దురాగతం జరిగిన తర్వాత నెలరోజులపాటు ఎదురు చూశాను. సీఎం మమత స్పందిస్తారని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ప్రభుత్వం ఆలస్యంగా చర్యలు తీసుకొంది. నేను ఇక ఎంపీగా కంటిన్యూ కాలేను’’ అని జవహర్ సిర్కార్ చెప్పారు. ‘‘నేను ఎంపీగా అవినీతి, మతతత్వం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో నియంతృత్వంపై పోరాడాను. ఆవిషయాల్లో ఎన్నడూ రాజీపడలేదు. పార్లమెంట్‌లో బెంగాల్ సమస్యలను ప్రస్తావించేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మమతా బెనర్జీకి థ్యాంక్స్’’ అని ఆయన లేఖలో ప్రస్తావించారు.