Trinamool Congress: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన సీనియర్‌ నేత

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 05:02 PM IST

 

Tapas Roy: తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు గట్టి షాక్‌ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్‌ రాయ్‌ (Tapas Roy)ఆ పార్టీకి సోమవారం రాజీనామా(resignation) చేశారు. పౌరసంఘాల నియామకాల్లో (civic body recruitments) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు తపస్‌ రాయ్‌ సహా ముగ్గురు పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిపిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

రాజీనామా(resignation) అనంతరం తన నివాసంలో ఈడీ దాడుల(ED attacks)పై తపస్‌ రాయ్‌ మీడియాతో మాట్లాడారు. దాడులు జరిపినప్పుడు పార్టీ నాయకత్వం తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మమత సైతం తనకు మద్దతుగా మాట్లాడలేదని.. ఇతర పార్టీ నేతలకు మాత్రం సీఎం అండగా నిలబడిందని వాపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే తపస్‌ రాయ్‌ బీజేపీ(bjp)లో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియా ఆయన్ని ప్రశ్నించింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నారా..? అని మీడియా ప్రశ్నించగా.. ‘దీని గురించి నేనేమీ చెప్పదల్చుకోలేదు’ అంటూ సమాధానమిచ్చారు.

read also : ‘Mukhyamantri Samman Yojana’: మ‌హిళ‌లంద‌రికీ నెల‌కు రూ. 1000 భృతి

1990లో టీఎంసీ ప్రారంభించినప్పటి నుంచి తపస్ రాయ్.. మమతా బెనర్జీ(Mamata Banerjee)కి సన్నిహితుడిగానే ఉన్నారు. టీఎంసీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాయ్‌కి కొంతకాలం క్రితం మమతా బెనర్జీ తన కేబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చారు. అయితే, కొద్ది రోజుల తర్వాత ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర కోల్‌కతా జిల్లా అధ్యక్షుడిగా కూడా తపస్ రాయ్‌ను తొలగించారు. ఈ క్రమంలోనే రాయ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.