PM Modi: ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది!

దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లలకి సంబంధించిన వ్యాక్సిన్ విషయంలో మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని 15 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. 2022 జనవరి 3 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం చేస్తామని తెలిపారు. జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మరో డోసు (బూస్టర్) కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.
60 ఏళ్లు దాటినవారికి కూడా 3వ డోసు వ్యాక్సిన్ ఇస్తామని మోదీ ప్రకటించారు. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నామని, ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.