Site icon HashtagU Telugu

Tim Cook India Visit : మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ తిన్న టిమ్ కుక్, ఫొటోలు వైరల్.

Tim

Tim

యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ (Tim Cook India Visit)ఇండియాలో ఆపిల్ మొదటి రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు సోమవారం ముంబైకి చేరుకున్నారు. పలుసార్లు భారత్‌లో పర్యటించిన కుక్, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. పర్యటనలో మొదటి రోజు, కుక్ భారతీయ సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంటి యాంటిల్లాను సందర్శించారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆయన కలిశారు.

భారత పర్యటన సందర్భంగా కుక్ టూర్ షెడ్యూల్ గురించి కంపెనీ అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం, BKC బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని బ్రాండ్ స్టోర్‌లో 100 మందికి పైగా ఉద్యోగులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేయడం ద్వారా కుక్ స్వయంగా తన రాకను ధృవీకరించారు. నేడు ముంబైలో యాపిల్ స్టోర్ ప్రారంభించనున్నారు.

ముంబైలో టిమ్ కుక్‌కు నటి మాధురీ దీక్షిత్ ఘనంగా స్వాగతం పలికారు..మాధురీ దీక్షిత్ కూడా టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్‌ను టేస్ట్ చేశారు. ఫోటోను పంచుకుంటూ, మాధురీ దీక్షిత్ ముంబైలో వడా పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేనని క్యాప్షన్‌లో రాశారు. ఈ ట్వీట్‌పై టిమ్ కుక్ స్పందిస్తూ, “నా మొదటి వడ పావ్‌ను నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు, ఇది రుచికరమైనది” అని రాశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version