TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ

2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్‌టాక్ భారత్‌లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్‌టాక్ వెబ్‌సైట్‌కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్‌లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్‌ఫారమ్ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించనున్నదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Published By: HashtagU Telugu Desk
TikTok re-entering India?.. Speculations are abound with job postings

TikTok re-entering India?.. Speculations are abound with job postings

TikTok : చైనా ఆధిపత్యంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ మళ్లీ భారత మార్కెట్‌ను మళ్లీ టార్గెట్ చేస్తోందా? గురుగ్రామ్‌లోని తమ కార్యాలయంలో ఉద్యోగులను నియమించేందుకు టిక్‌టాక్ LinkedInలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ పోస్టు కాగా, మరొకటి నాయకత్వ స్థాయి రోల్ కావడం విశేషం. 2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్‌టాక్ భారత్‌లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్‌టాక్ వెబ్‌సైట్‌కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్‌లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్‌ఫారమ్ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించనున్నదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Read Also: Aadhar Update : ఇకపై ఆధార్ మార్పులు కోసం ఆధార్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు..మరి ఎలా..?

ఇక, ఈ పరిణామాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ తాజా చైనా పర్యటన, డ్రాగన్ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ నేపథ్యంలో చోటుచేసుకోవడం గమనార్హం. భారత-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు వస్తున్నాయా? టిక్‌టాక్ వంటి సంస్థలు మళ్లీ భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం స్పష్టంగా టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పాయి. భద్రతా పరంగా ముందు జాగ్రత్త చర్యలే మా మొదటి ప్రాధాన్యం. టిక్‌టాక్ వంటి యాప్‌లపై నిషేధం కొనసాగుతుంది అని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతేకాదు, టిక్‌టాక్ వెబ్‌సైట్ యాక్సెసుబుల్ అవుతున్నా, లాగిన్ అవడం, వీడియోలు చూడడం ఇంకా సాధ్యపడటం లేదని వినిపిస్తోంది. ఇది కేవలం సర్వర్ మైగ్రేషన్ వల్లా? లేక వాస్తవంగా సంస్థ భారతదేశంలోకి రీ-ఎంట్రీ కోసం చర్యలు తీసుకుంటోందా? అన్నది స్పష్టతకు నోచుకోలేదు. పరిశీలిస్తే, టిక్‌టాక్ తాజా నియామక ప్రకటనలు చూస్తే సంస్థ ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికీ, నిబంధనల పరంగా టిక్‌టాక్‌కు భారత్‌లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటి వరకూ అనుమతి లభించలేదు. మొత్తానికి, టిక్‌టాక్ మళ్లీ భారత మార్కెట్‌ను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే విషయం స్పష్టమవుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిషేధంపై వెనక్కి తగ్గడం లేదు. ఇక, కొందరు కంటెంట్ క్రియేటర్లు టిక్ టాక్ వెబ్ సైట్ ను యాక్సెస్ చేసినట్లు చెప్పారు. అయితే టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేశారనే ప్రచారమంతా ఫేక్ అని తెలిపోయింది. టిక్ టాక్ పై బ్యాన్ ఇంకా అలాగే ఉందని భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాగే టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ కూడా భారత్ లో నిషేధం ఇంకా అమల్లో ఉందని స్పష్టం చేసింది. దీంతో టిక్ టాక్ పై వస్తున్న రూమర్లకు తెరపడింది.

Read Also: HYD : హైదరాబాద్ లోని ఆ ప్రాంతంలో నెలకు రూ. 5.4 కోట్లు అద్దె.. అది ఎక్కడో తెలుసా..?

  Last Updated: 31 Aug 2025, 02:35 PM IST