Tiger – 3640 Metres : వామ్మో.. అంత హైట్‌లోనూ టైగర్స్

Tiger - 3640 Metres : హిమాలయ రాష్ట్రం సిక్కిం.. మన దేశంలో ఎక్కువ హైట్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఇది ఒకటి.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 02:42 PM IST

Tiger – 3640 Metres : హిమాలయ రాష్ట్రం సిక్కిం.. మన దేశంలో ఎక్కువ హైట్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఇది ఒకటి.  మన దేశ జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్.  ఈ రాష్ట్రంలో 3640 మీటర్ల ఎత్తులో ఉన్న పంగోలాఖా వన్యప్రాణుల రిజర్వ్‌లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఒక అరుదైన సీన్ క్యాప్చర్ అయింది. అడవిలో నుంచి ఒక పెద్ద పులి వెళ్తున్న సీన్‌ను కెమెరా నిక్షిప్తం చేసింది. ఈ వీడియోను  నేచురల్ హిస్టరీ సొసైటీ తమ ట్విట్టర్ (X) హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. పులి సంచారానికి సంబంధించిన ఈ ఫొటోను 2023 ఫిబ్రవరి 25న సిక్కింలోని పాక్యోంగ్ జిల్లా పంగోలాఖా వన్యప్రాణుల అభయారణ్యంలో తీశారని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

సిక్కింలోని పంగోలాఖా వన్యప్రాణుల అభయారణ్యంలో పులి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2019 డిసెంబర్ 6న  సిక్కిం అటవీ శాఖ తొలిసారిగా 9,853 అడుగుల ఎత్తులో రాయల్ బెంగాల్ టైగర్‌ను కెమెరాలో బంధించింది. పంగోలక్ అనేది సిక్కింలోనే అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యం. ఇది 128 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అభయారణ్యాన్ని ఆనుకొని భూటాన్ అడవులు, పశ్చిమ బెంగాల్‌లోని నియోరా వ్యాలీ నేషనల్ పార్క్‌ ఉంటాయి. ఈ అభయారణ్యంలో రెడ్ పాండా, మంచు చిరుత, హిమాలయన్ బ్లాక్ బేర్ వంటి అనేక జీవ జాతులు ఉంటాయి. గతంలో 2018లో మరో హిమాలయ రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలోనూ 3,630 మీటర్ల ఎత్తులో పులుల ఉనికిని గుర్తించారు.  మన పొరుగు దేశం భూటాన్‌లోని అడవుల్లో  దాదాపు 4వేల మీటర్ల ఎత్తులో ఉన్న అటవీ ప్రాంతంలోనూ పులుల సంచారాన్ని(Tiger – 3640 Metres) గుర్తించారు.

Also Read: KCR Health Update : నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం..వాకర్ సాయంతో నడక