Site icon HashtagU Telugu

Tiger Attacks: గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి

Tiger

Tiger

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (VTR)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకరం రేకెత్తించింది.

గౌన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రి గ్రామానికి చెందిన దివ్య తన పనిలో నిమగ్నమై కట్టెలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఒక్క సారిగా పులి అక్కడికి చేరుకొని వెనకాల నుంచి దాడి చేసింది. దీంతో ఆమె మెడకు, చేతులకు గాయాలు అయ్యాయి. పులి దాడితో ఉలిక్కిపడిన బాధితురాలు కేకలు వేసింది. దీంతో సమీపంలోని పొలంలో పనిచేస్తున్న కొంతమంది రైతులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. అనంతరం బాధితురాలుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Also Read: RRR Wins Best Original Song: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’

కాగా.. ఇలాంటి ఘటనే పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహా సబ్ డివిజన్ పరిధిలో ఒకటి జరిగింది. సిరిసియా గ్రామంలో సోమవారం వ్యవసాయ పొలంలో నిమ్మగ్నమై ఉన్న మైనర్ బాలికతో పాటు ఇద్దరు వ్యక్తులపై పెద్ద పులి దాడి చేసింది. నౌరంగియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిసియా గ్రామానికి చెందిన బాధితురాలు సోమవారం రాత్రి సమీపంలోని పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఆమెపై దాడి చేసింది. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో అక్కడ పనిచేస్తున్న సోనమ్, సుభాష్ ముషార్ ఆమెకు సహాయం చేశాడు. పులి అతనిపై కూడా దాడి చేసి గాయపరిచింది. దాడి అనంతరం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో పులి పారిపోయింది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పక్కనే ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్ (విటిఆర్) నుండి పులి నివాస ప్రాంతంలోకి వచ్చి ఉండవచ్చని స్థానిక గ్రామస్తులు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ చంపారన్ జిల్లాలో రాష్ట్ర అటవీ శాఖకు చెందిన షార్ప్ షూటర్ల చేతిలో నరమాంస భక్షక పులిని చంపారు. ఆ ప్రాంతంలో పులి 11 మందిని చంపేసింది.

Exit mobile version