Modi 3.0 Cabinet: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలలో NDA మెజారిటీ సాధించిన తర్వాత జూన్ 9 ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. వీటన్నింటితో పాటు మోడీ 3.0 కేబినెట్‌లోకి వచ్చే మంత్రుల పేర్లపై కూడా చర్చ జోరందుకుంది. మరి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.
ఈ మంత్రి పదవులకు డిమాండ్
వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీ జూన్ 9న రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈసారి మిత్రపక్షమైన టీడీపీ, జేడీయూ కోటాలో పలువురు మంత్రులు కూడా పాల్గొనవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ కొత్త టీమ్‌లో ఎవరు చేరబోతున్నారు..? ఈ కొత్త టీమ్‌లో ఎంతమంది కొత్త ముఖాలు కనిపించబోతున్నారు అనే దానిపైనే అందరి చూపు పడింది. మిత్రపక్షం టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని, రైల్వే మంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖను కోరినట్లు సమాచారం. దీనితో పాటు ఇతర మిత్రపక్షాలు రైల్వే, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.
Also Read: National Best Friend Day: నేడు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే.. దీని ప్రాముఖ్యత ఇదే..!
ఎవరికి ఎన్ని పదవులు?
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సీనియర్ నేత అమిత్ షా సమక్షంలో జరిగిన ఎన్డీయే సమావేశంలో టీడీపీకి మూడు, జేడీయూకి మూడు, ఎన్సీపీ, శివసేన, JDS, RLDకి ఒక్కో మంత్రి పదవులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.
We’re now on WhatsApp : Click to Join
నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఇది మెజారిటీ సంఖ్య (272) కంటే 32 సీట్లు తక్కువ. అయితే ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ మార్కును దాటేసింది. బీజేపీతో పాటు 14 మిత్రపక్షాల నుంచి ఎన్డీయేకు 53 మంది ఎంపీలు ఉన్నారు. కూటమిలో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ 16 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవగా, నితీశ్ కునార్ నేతృత్వంలోని జేడీయూ 12 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ సమయంలో బీజేపీకి రెండు పార్టీలు అవసరం. వారు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం. అందుకోసమే వారికి అడిగిన మంత్రి పదవులను ఇచ్చినట్లు సమాచారం. మరి మోదీతో పాటు రేపు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో చూద్దాం.!