జమ్మూకశ్మీర్ లోని కుప్వారా సెక్టార్ లో విషాదం నెలకొంది. భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. వీరు 56ఆర్ ఆర్ కు చెందిన సైనికులు. డ్యూటీలో ఉండగా ఈ విషాదం నెలకొంది. సైనికుల భౌతికకాయాలను బయటకు తీసినట్లు కుప్వారా పోలీసులు తెలిపారు. వీరమరణం పొందిన సైనికుల పేర్లు సౌవిక్ హజ్రా, ముఖేశ్ కుమార్, మనోజ్ లక్ష్మణ్ రావు. ముగ్గురి భౌతికాయాలను 168 ఎంహెచ్ డ్రగ్ముల్లాకు పంపించారు.
శుక్రవారం ఉత్తరకశ్మీర్ లోని మచల్ ప్రాంతంలో భారీగా హిమాపాతం కురిసింది. పట్టులో డ్యూటీలో ఉన్న ముగ్గురు సైనికులు హిమపాతాన్ని తట్టుకోలేకపోవడంతో ఈ విషాదం నెలకొంది. ఎల్ఓసీ సమీపంలో జవాన్ల దళం పెట్రోలింగ్ కు బయలుదేరింది. అక్కడ ముగ్గురు సైనికులపై భారీ మంచు పడిఉండటాన్ని గమనించారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత వారిని కనుగొన్నారు. ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు.