Site icon HashtagU Telugu

Indian students : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి

Three Indian students died in a road accident in America

Three Indian students died in a road accident in America

Indian students: అమెరికా(America)లో మునుపు ఎన్నడూ లేనంతగా ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల(Indians) సంఖ్య భారీగా పెరుగుతుంది. ఉన్నత విద్యను(Higher Education) అభ్యసించేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు(Road accidents), హత్యల(Murders)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రం( Georgia State)లోని అల్ఫారెట్టా(Alpharetta)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు(Indian students) ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ 18 ఏళ్ల వయసు వారే కావడం విషాదం. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మృతులను అల్ఫారెట్టా హైస్కూల్, జార్జియా యూనివర్సిటీకి చెందిన ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల, అన్విశర్మగా గుర్తించారు. వీరిలో శ్రియ అవసరాల తెలుగమ్మాయి. రిత్విక్ సోమేపల్లి, మొహమ్మద్ లియాకత్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారును డ్రైవ్ చేసింది లియాకత్ అని పోలీసులు తెలిపారు. అతివేగం కారణంగా కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తాపడినట్టు చెప్పారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా అన్విశర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read Also: Kiara Advani – Janhvi Kapoor : ఆ హీరోకి జంటగా కియారా అద్వానీ, జాన్వీ కపూర్..