Site icon HashtagU Telugu

Worlds Toughest Exams-India : ప్రపంచంలో కష్టమైన 10 ఎగ్జామ్స్ లో 3 మనవే!!

Worlds Toughest Exams India

Worlds Toughest Exams India

Worlds Toughest Exams-India : ఎగ్జామ్.. 

ఈ మాట వినగానే చాలామంది హడలిపోతుంటారు..

ఇక ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంట్రెన్స్ కోసం ఎగ్జామ్ అంటే మామూలు ముచ్చట కాదు.. 

కీలకమైన ప్రభుత్వ విభాగాలలో జాబ్స్ కోసం జరిగే ఎగ్జామ్స్ లో నెగ్గాలంటే చెమట చిందించాల్సిందే..      

ప్రపంచంలోని 10 కష్టతరమైన ఎగ్జామ్స్ లో 3 మన ఇండియాలోనే జరుగుతాయట !!

పరీక్ష అనగానే ఎక్కడ లేని ఒత్తిడి వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. అదొక కొరకరాని కొయ్యలా చాలామందికి కనిపిస్తుంది. రోజూ గంటల కొద్దీ సమయాన్ని పుస్తకాలతో గడిపితే కానీ ఎగ్జామ్స్ లో గెలుపొందటం అసాధ్యం. విజయానికి దగ్గరి దారులు ఉండవు. కష్టపడటం ఒక్కటే మార్గం. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన  పరీక్షల విషయానికి వస్తే..  ఈ జాబితాలో మొదటిది చైనాలోని గావోకావో(Gaokao) పరీక్ష. చాలా వరకు పరీక్షలు 3 నుంచి 4 గంటల పాటు జరుగుతాయని మనందరికీ తెలుసు.  కానీ Gaokao పరీక్షను ఏకంగా 9 గంటల పాటు నిర్వహిస్తారు. గావోకావో పరీక్ష.. అనేది కళాశాల ప్రవేశ పరీక్ష.  గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికి దీన్ని నిర్వహిస్తారు.  దాదాపు  రెండు, మూడు రోజుల పాటు ప్రతిరోజూ  తొమ్మిది గంటల పాటు ఈ ఎగ్జామ్ జరుగుతుంది.దీనికి హాజరు కావడానికి ఇష్టపడే విద్యార్థులు చైనీస్ భాష, గణితం పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. విదేశీ భాషా భాగంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్, రష్యన్, జర్మన్ లేదా స్పానిష్ వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. Gaokao పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు లిబరల్ ఆర్ట్స్ లేదా నేచురల్ సైన్స్ నుంచి  ఒక స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి. ఈ పరీక్షలో ఎంపికయ్యే వారికి  చైనాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పిస్తారు.

Gaokao తర్వాత మన ఎగ్జామే టఫ్..

Gaokao పరీక్ష తర్వాత అత్యంత కష్టతరమైన ఎగ్జామ్(Worlds Toughest Exams-India) మన ఇండియాలో నిర్వహించే IIT JEE. ఐఐటీలతో సహా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం అనేది జేఈఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. మూడో ప్లేస్ లో కూడా మన ఇండియా ఎగ్జామే ఉంది. అదే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అవుతారనే విషయం మనకు తెలిసిందే. ఈ లిస్టులో 8వ ప్లేస్ లో  గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఎగ్జామ్ నిలిచింది. గేట్ పరీక్ష ఉద్యోగాలతో పాటు ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు ప్రవేశాన్ని అందిస్తుంది.

Also read : TS Lawcet Key : లాసెట్ ఎగ్జామ్ కీ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

ప్రపంచంలోనే 10 కష్టతరమైన పరీక్షలు ఇవీ.. 

1. గావోకావో పరీక్ష (చైనా)

2. IIT JEE పరీక్ష (భారతదేశం)

3. UPSC పరీక్ష (భారతదేశం)

4. మెన్సా పరీక్ష (UK)

5. GRE పరీక్ష  (అమెరికా)

6. CFA (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) (USA)

7. CCIE (సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్‌ వర్క్ నిపుణుడు)

8. గేట్ పరీక్ష (భారతదేశం)

9. USMLE పరీక్ష (అమెరికా)

10. కాలిఫోర్నియా (బార్ పరీక్ష)

Exit mobile version