MP : మతమార్పిడి…ముగ్గురు హిందూ మైనర్లను బలవంతంగా ముస్లింలుగా మార్చిన వైనం!!

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 10:06 PM IST

మధ్యప్రదేశ్ లో మతమార్పిడి కలకలం రేపింది. రైసెన్ జిల్లాలో చైల్డ్ కేర్ ఆపరేటర్ లో నివసిస్తున్న ముగ్గురు హిందూ మైనర్ల పేర్లను ముస్లిం పేర్లతో మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జాతీయబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయఅధ్యక్షుడు ప్రియాంక్ కనుంగో స్వయంగా చేశారు. శిశు గ్రుహ ఆపరేటర్ ఆధార్ కార్డులో పేర్లను కూడా మార్చారంటూ ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి ప్రియాంక్ కనుంగో రైసెన్ జిల్లాలోని గోహర్ గంజ్ పట్టణాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కొత్త పేర్లు, కుల ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు చిల్ర్డన్స్ హోం నిర్వాహకులు ముగ్గురు పిల్లల పేర్లు, మతం మార్చిన విషయం ఆయన ద్రుష్టికి వచ్చింది. చిన్నారులతో మాట్లాడిన ప్రియాంక్ కనుంగో…తమ తల్లిదండ్రులు హిందువులని…వసతి గ్రుహంలో తమ పేర్లను ముస్లిం పేర్లతో మార్చారని చెప్పారు. వారి ఆధార్ కార్డుల్లో కూడా ముస్లిం పేర్లతోనే నమోదు చేశారు.

ఈ విషయంలో వెలుగులోకి రాగానే బాలల కమిషన్ ఛైర్మన్ డైరెక్టర్ హసీన్ పై సీరియస్ అయ్యారు. శిశు గ్రుహానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహిళా శిశు అభివ్రుద్ధి సంక్షేమ శాఖను ఆదేశించారు. రెండేళ్ల క్రితం కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులు ఎన్జీవో ఆద్వర్యంలోని గోహర్ గంజ్ లో శిశు గ్రుహంలో ఆశ్రయం పొందుతున్నారు. దీనికి కారణమైన వారికి పై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆదేశాలు ఇచ్చారు.