Three People Burnt: విషాదం.. కారులో ముగ్గురు సజీవదహనం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ (Bilaspur) జిల్లా రతన్‌పూర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారులో నుంచి దిగే అవకాశం లేకపోవడంతో వారు మృతి చెందారు.

  • Written By:
  • Updated On - January 22, 2023 / 04:38 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ (Bilaspur) జిల్లా రతన్‌పూర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారులో నుంచి దిగే అవకాశం లేకపోవడంతో మృతి చెందారు. కారులో ఉన్న ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదం రతన్‌పూర్-పాండ్రో రహదారిపై జరిగింది. ఖైరా పౌరి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత కారుకు మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా చెలరేగడంతో కారులో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో వారు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం శనివారం అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత దారిన వెళ్లేవారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా, మంటలు చెలరేగడంతో కారు బూడిదైంది. ఈ కారు రతన్‌పూర్ నుంచి పెండ్రా వైపు వెళ్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కారులో 3 నుంచి 4 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Terrorist Gurupatwant Singh: ఢిల్లీనే మా టార్గెట్.. ఉగ్రదాడి చేస్తాం: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను

ప్రమాదానికి గురైన కారు బిలాస్‌పూర్‌కు చెందినది. ప్రస్తుతం మృతుల గురించి ఎలాంటి సమాచారం అందలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో మృతుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇతర సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.