Death Threat: ప్రధాని మోడీ, సిఎం యోగిని చంపేస్తామంటూ బెదిరింపులు

  Death Threat: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి. ఓ వ్యక్తి వారిద్దరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ( Karnataka man)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. We’re now on WhatsApp. Click to Join. నిందితుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా సిర్పూర్‌ వాసి మహ్మద్ రసూల్‌గా […]

Published By: HashtagU Telugu Desk
Threats To Kill Pm Modi And

Threats To Kill Pm Modi And

 

Death Threat: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి. ఓ వ్యక్తి వారిద్దరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ( Karnataka man)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

నిందితుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా సిర్పూర్‌ వాసి మహ్మద్ రసూల్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. అందులో ప్రధాని మోడీపై అభ్యంతరకర పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా మోడీ, యూపీ సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై 505(1)(బి), 25(1)(బి) సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేశారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తూ అక్కడే స్థిరపడినట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కోసం హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.

read also : Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ

 

  Last Updated: 05 Mar 2024, 12:49 PM IST