Site icon HashtagU Telugu

Bomb Threat: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి బెదిరింపు ఈమెయిల్

Threatening Email To Karnat

Threatening Email To Karnat

 

Bomb Threat Email : ఇటీవ‌లి రామేశ్వ‌రం కేఫ్‌లో పేలుడుతో బెంగ‌ళూర్ న‌గ‌రం ఉలిక్కిప‌డ‌గా తాజాగా ఓ వ్య‌క్తి నుంచి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి(Karnataka Govt) బెదిరింపు ఈమెయిల్(Email)రావ‌డం క‌ల‌క‌లం రేపింది. బెంగ‌ళూర్‌లో శ‌నివారం పేలుడు జ‌రుగుతుంద‌ని మెయిల్ పంపిన వ్య‌క్తి బెదిరించాడు. సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌, హోంమంత్రి, బెంగ‌ళూర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌ల‌ను ఉద్దేశించి అజ్ఞాత వ్య‌క్తి ఈ మెయిల్ పంపాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ-మెయిల్ పంపిన వ్య‌క్తిని షాహిద్ ఖాన్‌గా గుర్తించారు. ఈమెయిల్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం రెస్టారెంట్లు, ఆల‌యాలు, బ‌స్సులు, రైళ్లు వంటి ర‌ద్దీ ప్ర‌దేశాల్లో పేలుడు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

read also : Dasoju Sravan: ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాండి: దాసోజు శ్రవణ్ సూచన

బ‌హిరంగ కార్య‌క్ర‌మాల్లో బాంబుల‌ను కూడా అమ‌రుస్తామ‌ని మెయిల్ పంపిన వ్య‌క్తి హెచ్చ‌రించాడు. పేలుడుకు పాల్ప‌డ‌కుండా ఉండేందుకు త‌మ‌కు రూ. 20 కోట్లుపైగా చెల్లించాల‌ని నేర‌గాళ్లు డిమాండ్ చేసిన‌ట్టు మెయిల్ హెచ్చ‌రించింది. కాగా ఈ వ్య‌వ‌హారంపై సుమోటోగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.