Site icon HashtagU Telugu

Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ

This plant is a strong symbol of the strength, bravery and inspiration of our country's women: PM Modi

This plant is a strong symbol of the strength, bravery and inspiration of our country's women: PM Modi

Sindhura plant : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూన్ 5న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, న్యూ ఢిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో ఓ ప్రత్యేకమైన మొక్కను నాటారు. ఇది సాధారణ మొక్క కాదు 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న మహిళా వీరాంగనలు ప్రధానికి బహుమతిగా అందించిన ‘సింధూర’ మొక్క. ఈ సందర్భంగా మోడీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక ప్రత్యేకమైన పోస్టు షేర్‌ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారతదేశం చేపట్టిన యుద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులు అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో వారు నన్ను కలిసి, ఈ ‘సింధూర’ మొక్కను మన జవాన్ల శౌర్యానికి గుర్తుగా బహూకరించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గౌరవం నాకందినందుకు ఎంతో గర్వంగా ఉంది అంటూ ప్రధాని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తిని, వీరత్వాన్ని, స్ఫూర్తిని ప్రతిబింబించేదిగా నిలుస్తుందన్నారు.

ప్రధాని మొక్క నాటుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటూ వైరల్‌గా మారాయి. మోడీ చేతులారా గడ్డిని తొలగించి, శ్రద్ధగా మొక్కను నాటుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని పొందాయి. ఇదే సందర్భంలో, ఈ మొక్కకు సంబంధించిన గాథ కూడా మనసులను కదిలిస్తోంది. పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు మహిళల నుదిటిపై ఉన్న సింధూరాన్ని బలవంతంగా తుడవడం, అప్పుడు భారతదేశం ఆ ఘటనపై తీవ్రంగా స్పందించడం చరిత్రలో ప్రత్యేకంగా గుర్తించబడింది. ఆ సంఘటనకు ప్రతీకగా, భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌పై ఉగ్రవాద స్థావరాలపై కీలక దాడులు చేసింది. ఆ చర్యల్లో మహిళల పాత్రను గుర్తుపట్టే విధంగా, 1971 యుద్ధంలో పాలుగన్న మహిళా బృందం ‘సింధూర’ మొక్కను ప్రధానికి అందజేసింది. ఈ మొక్క నాటడం కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, భారత మహిళా శక్తికి ఘనమైన నివాళిగా నిలిచింది. ఇది సైనిక పరాక్రమానికి, సాంస్కృతిక పరంపరలకు, మహిళల వీరత్వానికి సంకేతంగా నిలుస్తోంది.

Read Also: World Environment Day : వనమహోత్సవం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..పర్యావరణ పరిరక్షణపై మద్దతు