Site icon HashtagU Telugu

PM Modi – Parliament : స్పెషల్ పార్లమెంట్ సెషన్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

Delimitation

Pm Modi Parliament

PM Modi – Parliament : స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం  మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ పార్లమెంట్‌ సెషన్స్ చాలా తక్కువ టైమే జరుగుతుండొచ్చు. కానీ ఇవి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి’’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ సెషన్స్ లో కేంద్ర సర్కారు సంచలన నిర్ణయాలు, కీలక తీర్మానాలు, ముఖ్యమైన బిల్లులపై ముందడుగు వేస్తుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ సమావేశాలు స్వల్పమే అయినా.. ఇవి చారిత్రాత్మక నిర్ణయాలకు వేదిక కానున్నాయి. ఈ సెషన్ విలువైనది. ప్రత్యేకమైనది. 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రయాణంలో మైలురాయిగా మారబోతోంది. ఈ సెషన్ చాలా విధాలుగా ముఖ్యమైనది. ఎంపీలందరూ ఈ సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి’’ అని కోరారు.

Also read : Tomato – 50 Paisa : 50 పైసలకు కిలో టమాటా.. రైతుల లబోదిబో.. సామాన్యుల సంతోషం

కొత్త ఉత్సాహంతో కొత్త పార్లమెంటులోని మనమంతా అడుగుపెడదామని పేర్కొన్నారు. జీ20 సదస్సు సందర్భంగా ‘గ్లోబల్ సౌత్’ దేశాల గొంతుగా మారినందుకు గర్వంగా ఉందని మోడీ చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ కు జీ20లో శాశ్వత సభ్యత్వం దక్కడం భారత్ సాధించిన విజయమేనని (PM Modi – Parliament)  తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయిన తర్వాత మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందన్నారు. చంద్రుడిపై మన చంద్రయాన్ ల్యాండర్ దిగిన ‘శివశక్తి పాయింట్’ మనకు కొత్త ప్రేరణను అందిస్తోందని కామెంట్ చేశారు.

Exit mobile version