Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే..

వచ్చే నెల(జూన్)లో వివిధ బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - May 25, 2024 / 08:01 AM IST

Bank Holidays: వచ్చే నెల(జూన్)లో వివిధ బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. ఆయా బ్యాంకుల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలి. ఈ సెలవుల గురించి మర్చిపోయి ఏదైనా బ్యాంకు పనిని ప్లాన్ చేసుకుంటే.. చాలా టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది ప్రతినెలా బ్యాంకుకు ఉండే ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనేది తప్పకుండా చెక్ చేస్తుంటారు. 2024 జూన్ నెలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) విడుదల చేసిన సెలవుల(Bank Holidays) జాబితాను ఓసారి చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే.. 

  • జూన్​ 2 (ఆదివారం) : జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈసందర్భంగా ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్​ 9 (ఆదివారం) :  జూన్ 9న మహారాణా ప్రతాప్ జయంతి ఉంది. ఈసందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్​లలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్​ 10 (సోమవారం) : జూన్ 10న శ్రీ గురు అర్జున్​ దేవ్​జీ వర్ధంతి ఉంది. ఈ సందర్భంగా పంజాబ్​లోని బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 14 (శుక్రవారం) : జూన్ 14న పహిలి రాజా పండుగ ఉంది. ఈసందర్భంగా ఒడిశాలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్​ 15 (శనివారం) : జూన్ 15న రాజా సంక్రాంతి సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ రోజున యంగ్ మిజో అసోసియేషన్ డే సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Also Read :Rave Party : బెంగళూరు రేవ్‌ పార్టీ వ్యవహారం.. ఏపీతో పొలిటికల్ లింకులు ?

  • జూన్​ 16 (ఆదివారం) : జూన్ 16న ఆదివారం వస్తోంది. ఆ రోజు ఎలాగూ బ్యాంకులకు సెలవే.
  • జూన్ 17 (సోమవారం) : జూన్ 17న  బక్రీద్ పండుగ ఉంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ సెలవు ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఈ సెలవు ఉండదు.
  • జూన్ 21 (శుక్రవారం) :  జూన్ 21న వట సావిత్రీ వ్రతం సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్ 22 (శనివారం) :  జూన్ 22న  సంత్​ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్​గఢ్​, హిమాచల్​ ప్రదేశ్​, హరియాణా, పంజాబ్​ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్ 30 (ఆదివారం) :  జూన్ 30న రెమ్నా ని (శాంతి దినోత్సవం) సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Also Read :Phase 6 Polling: ఆరో విడత పోలింగ్ షురూ.. బరిలో మేనకాగాంధీ, ఖట్టర్, ముఫ్తీ, కన్హయ్య