PM Modi : ఇదే ప్రధాని మోదీ సింప్లిసిటీ అంటే…రాత్రి 10గంటలు దాటిందని…!!!

దేశప్రధానమంత్రి నరేంద్రమోదీ....నిరాండంబరానికి మారు పేరు. తాను ఎన్నో సందర్భాల్లో సామాన్యుడిగా నిరూపించారు. రూల్స్ పాటించడంలోనూ ముందుంటారు.

Published By: HashtagU Telugu Desk
Modi Imresizer

Modi Imresizer

దేశప్రధానమంత్రి నరేంద్రమోదీ….నిరాండంబరానికి మారు పేరు. తాను ఎన్నో సందర్భాల్లో సామాన్యుడిగా నిరూపించారు. రూల్స్ పాటించడంలోనూ ముందుంటారు. సామాన్య పౌరుడిగా బాధ్యతలు పాటిస్తారు. కొన్ని సార్లు తానే స్వయంగా పనులు చేస్తుంటారు. బీచ్ లో ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త ఏరుతూ, నలుగురిలో కలిసిపోవడం..ఒకసాధారణ మనిషిగా కనిపిస్తుంటారు. ఇవన్నీ కూడా మోదీ సింప్లిసిటీకి నిదర్శనం.

ఇప్పుడు మరోసారి తన సింప్లిసిటీని నిరూపించుకున్నారు మోదీ. అందరికీ నిబంధనలు ఒకటే. అందరూ పాటించాల్సిందే అంటూ రాజస్తాన్ లోని అబూ రోడ్డులో శుక్రవారం రాత్రి బహిరంగ సభన ఏర్పాటు చేశారు. ఈ సభలో మోదీ పాల్గొన్నారు. ప్రసంగించాల్సిన సమయంలో వచ్చింది. అప్పటికే రాత్రి పది దాటింది. అక్కడి నింబంధనల ప్రకారం రాత్రి పది దాటితే మైక్ లను ఉపయోగించరాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని కూడా మైక్ ఉపయోగించలేదు. ప్రజలకు అభివాదం చేసి మైక్ వాడకుండా మాట్లాడారు.

  Last Updated: 01 Oct 2022, 10:45 AM IST