Site icon HashtagU Telugu

Sabyasachi Mangalsutra Ad : ఛీ ఛీ….లోదుస్తుల్లో మంగళసూత్రమా

ఫెమస్ బెంగాలీ డిజైనర్ సబ్యసాచి ప్రోడక్ట్స్ కి ఇండియాలోనే కాకుండా ఇతరదేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ఇన్ని రోజులు సబ్యసాచి ముఖర్జీ ప్రాడక్ట్స్ ని ఎంతో ఇష్టపడ్డ వారే ఇప్పుడు ఆయనపై మండి పడుతున్నారు.

 

సబ్యసాచి ఇటీవలే తమ ప్రమోషన్ లో భాగంగా కొన్ని కొత్త మంగళసూత్రం డిజైన్స్ ఫోటోలు తమ పోర్టల్ లో పబ్లిష్ చేసింది. ఆ ఫోటో షూట్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. యాడ్ లో భాగంగా కొన్ని జంటలు అసభ్యకరమైన పద్ధతుల్లో వాటిని ప్రదర్శించారని, కొన్ని ఫోటోల్లో మంగళసూత్రాన్ని లోదుస్తులతో పాటు ఉండడాన్ని కొందరు మహిళలు తప్పుపడుతున్నారు.

https://twitter.com/immortalsoulin/status/1453322750014091267

ముఖ్యంగా హిందూ మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రంపై ఇలాంటి యాడ్ ఏంటని సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థపై విరుచుకపడుతున్నారు. ప్రోడక్ట్ అమ్మకానికి మరి ఇంత దిగజారడం ఏంటని, అసలు సబ్యసాచి వాళ్ళు ఇలా ఎందుకు తయారయ్యారని, మంగళసూత్రం ఫ్యాషన్ జ్యూవెలరీ కాదని, ఇది కండోమ్ యాడ్ లాగా ఉందని కొందరు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమ సంస్థ రిప్యుటేషన్ దెబ్బతీసేలా ఉన్న ప్రస్తుత ప్రమోషన్ ఫోటోలపై ఎలా స్పందిస్తారో, లేదా జనాల్లో చర్చ జరగాలనే ఇలాంటి పిక్స్ రిలీజ్ చేసి పబ్లిసిటీ స్టెంట్ వేసే బిజినెస్ సీక్రేటో చూడాలి