Site icon HashtagU Telugu

PM Modi : ఇది శక్తికాంత దాస్‌ నాయకత్వానికి లభించిన గుర్తింపు : ప్రధాని మోడీ

This is a recognition of Shaktikanta Das's leadership: PM Modi

This is a recognition of Shaktikanta Das's leadership: PM Modi

PM Modi: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( Reserve Bank of India)గవర్నర్‌ (Governor) శక్తికాంత్‌ దాసు ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా వరుసగా రెండో సారీ ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. “ఇది ఆయనలోని నాయకత్వానికి లభించిన గుర్తింపుగా కొనియాడారు. ఈ ఘనత సాధించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అభినందనలు. అది కూడా రెండోసారి. ఆర్‌బీఐలో ఆయన నాయకత్వానికి,  ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని నిర్ధరించే దిశగా ఆయన చేసిన కృషికి ఇది గుర్తింపు” అని మోడీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగ్‌జైన్‌ ఇచ్చిన ర్యాంకుల్లో శక్తికాంత దాస్‌కు (Shaktikanta Das) అగ్రస్థానం దక్కింది. గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌ 2024లో శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్‌ లభించిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆర్‌బీఐ వెల్లడించింది. ఏ+ రేటింగ్‌ను ప్రపంచంలో ముగ్గురు కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌లకు ఇవ్వగా.. అందులో దాస్‌ అగ్రస్థానం పొందారు. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా కేంద్ర బ్యాంకుల గవర్నర్లకు ఏ నుంచి ఎఫ్‌ వరకు గ్రేడ్‌లను కేటాయించారు. అద్భుత పనితీరుకు ఏ, అధ్వాన పనితీరుకు ఎఫ్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఏ+ రేటింగ్‌ పొందిన కేంద్ర బ్యాంకర్లలో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్‌ కెటెల్‌ ధామ్‌సన్, స్విట్జర్లాండ్‌ గవర్నర్‌ ధామస్‌ జే జోర్డాన్‌ ఉన్నారు.

ఇకపోతే.. బ్రెజిల్‌కు చెందిన రాబర్టో కాంపోస్ నెటో, చిలీకి చెందిన రోసన్నా కోస్టా, మౌరిషస్ నుంచి హర్వే కుమార్ సీగోలం, మొరాకోకు చెందిన అబ్దెల్లతీఫ్ జౌహ్రీ, దక్షిణాఫ్రికాకు చెందిన లెసెట్జా క్గాన్యాగో, శ్రీలంకకు చెందిన నందలాల్ వీరసింగ్, వియత్నాంకు చెందిన న్గుయెన్ థీ హాంగ్ “A” రేటింగ్‌ను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి అందుకున్న వారిలో నిలిచారు. కాగా, కంబోడియాకు చెందిన చీ సెరీ, కెనడాకు చెందిన టిఫ్ మాక్లెమ్, కోస్టారికాకు చెందిన రోజర్ మాడ్రిగల్ లోపెజ్, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన హెక్టర్ వాల్డెజ్ అల్బిజు, యూరోపియన్ యూనియన్‌కు చెందిన క్రిస్టీన్ లగార్డే, గ్వాటెమాలాకు చెందిన అల్వారో గొంజాలెజ్ రిక్కీ, ఇండోనేషియాకు చెందిన పెర్రీ వార్జియో, జమైకాస్, జమైకాస్ అడ్రాన్ ల్ఖాగ్వాసురెన్, నార్వే నుంచి ఇడా వోల్డెన్ బాచే, పెరూకు చెందిన జూలియో వెలార్డ్ ఫ్లోర్స్, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎలి రెమోలోనా, స్వీడన్‌కు చెందిన ఎరిక్ థెడెన్, అమెరికాకు చెందిన జెరోమ్ హేడెన్ పావెల్ మాత్రం “A-” రేటింగ్‌ను అందుకున్న సెంట్రల్ బ్యాంకర్లుగా నిలిచారు.

Read Also: N Convention : కింగ్ నాగార్జున కు రేవంత్ సర్కార్ షాక్ ఇస్తుందా..?