Canara Bank : బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ

Canara Bank : కెనరా బ్యాంకు (Canara Bank) శాఖలో దొంగలు చొరబడి ప్రజలు తాకట్టు పెట్టిన విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు

Published By: HashtagU Telugu Desk
Bank Robbery

Bank Robbery

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భారీ చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. మంగోలి(Mangoli branch)లో ఉన్న కెనరా బ్యాంకు (Canara Bank) శాఖలో దొంగలు చొరబడి ప్రజలు తాకట్టు పెట్టిన విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మొత్తం 59 కిలోల బంగారం (decamping with 59 kg of gold) నష్టం జరిగినట్టు సమాచారం. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, జిల్లా పోలీసుల దృష్టికి చేరిన వెంటనే విచారణ ప్రారంభమైంది.

IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైన‌ల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!

విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి. నింబార్గి ప్రకారం.. మే 23న బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. తర్వాతి రెండు రోజులు నాలుగో శనివారం మరియు ఆదివారం సెలవులు ఉండటంతో బ్యాంకు మూసి ఉంది. మే 26న గుమాస్తా శుభ్రపరిచేందుకు వచ్చేసరికి షట్టర్ తాళం కట్ చేసి ఉన్నట్లు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు మేనేజర్ కూడా అదే రోజు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Tesla Plant in India : భారత్లో టెస్లా ప్లాంట్ లేనట్లే!

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించగా, బ్యాంకులోకి దొంగలు చొరబడి నగల గది తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను అపహరించినట్లు గుర్తించారు. చోరీకి గురైన బంగారం మొత్తం రూ. కోట్ల విలువ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ నింబార్గి ప్రకటించారు. ఈ ఘటన బ్యాంకుల భద్రత వ్యవస్థపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నదీగా ప్రజలలో ఆందోళన నెలకొంది.

  Last Updated: 03 Jun 2025, 07:29 AM IST