Aryan khan : జైల్లో లేకున్నా ఈ కండిషన్స్ పాటించాల్సిందే!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ కి కొన్ని కండిషన్స్

  • Written By:
  • Updated On - October 29, 2021 / 11:11 AM IST

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ కి కొన్ని కండిషన్స్ కచ్చితంగా పెట్టాలని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కోర్టును కోరింది. అవేంటో చూడండి.

  1. ఆర్యన్ ఖాన్ విదేశాలకు వెళ్లకుండా వెంటనే తన పాస్పోర్ట్ స్పెషల్ కోర్టుకి సబ్మిట్ చేయాలి.ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే స్పెషల్ కోర్టు అనుమతి తీసుకోవాలి.
  2. తన ప్రస్తుత నివాస స్థలం ముంబాయి కాకుండా దేశంలోని ఇతర ప్రదేశాలకి వెళ్లాలంటే ఇన్వెస్టిగేటివ్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
  3. కేసు విచారణలో ఉన్నది కాబట్టి ఈ కేసుకు సంబందించిన విషయాలను మీడియాతో గానీ సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించకూడదు.
  4. ఈ కేసుతో నేరుగా లేదా ఇండైరెక్ట్ గా సంబంధం ఉన్న ఎవరితోనూ ఎలాంటి కమ్యూనికేషన్ చేయకూడదు.
  5. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు ముంబాయి లోని ఎన్సీబీ ఆఫీసులో సంతకం పెట్టాలి.
  6. వీటితో పాటు కేసును నీరుగార్చే ప్రయత్నం, పక్కదారి పట్టించే ప్రయత్నం, సాక్షులను ప్రలోభపెట్టడం, భయపెట్టడం లాంటి చర్యలకు పాల్పడకూడదు.
  7. పై వాటిల్లో ఏ ఒక్కటి అతిక్రమించినా ఆర్యన్ బెయిల్ వెంటనే రద్దయిపోయి మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.