Modi 3.0 : కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు వీరే ..

ముందుగా ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్

  • Written By:
  • Publish Date - June 9, 2024 / 11:30 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ లోని రాజ్​భవన్​ వద్ద ప్రధాని మోడీ తో పాటు 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే , నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం చేసిన వారు వీరే.

ముందుగా ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, ప్రతాప్ రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అథవాలే, రామ్‌నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, వి.సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ భగేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేశ్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేశ్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దుబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందార్, సావిత్రీ ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరెటా ప్రమాణ స్వీకారం చేసారు.

తెలుగు రాష్ట్రాల నుండి ప్రమాణ స్వీకారం చేసిన వారిలో..

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే బండి సంజయ్ ఏపీ నుంచి టిడిపి తరుపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రమాణ స్వీకారం చేయగా, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, రవీనా టండన్‌, అనుపమ్‌ ఖేర్‌, విక్రాంత్‌ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వీరితోపాటు అంబానీ కుమారులు అనంత్‌, ఆకాశ్‌, అల్లుడు ఆనంద్‌ పిరమల్‌ రాగా గౌతమ్‌ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేశ్‌ అదానీలు హాజరయ్యారు.