Site icon HashtagU Telugu

Vice President : పదవి కాలం పూర్తికాక ముందే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసింది వీరే..!

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

భారత ఉపరాష్ట్రపతి (Vice President ) పదవీ కాలం పూర్తికాకముందే రాజీనామా చేసిన నేతల జాబితాలో తాజాగా జగదీప్ ధనఖడ్ (Jagdeep Dhankhar) చేరారు. అనారోగ్య కారణాలతో ఆయన ఈ పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. భారత రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు కాగా, దీన్ని పూర్తి చేయకముందే రాజీనామా చేయడం అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. జగదీప్ ధనఖడ్ ముందు మరికొంతమంది ప్రముఖులు ఈ పదవిని మధ్యలోనే వదిలి రాష్ట్రపతులుగా మారిన ఉదాహరణలు ఉన్నాయి.

ఇందులో 1969లో వివి గిరి, 1987లో ఆర్ వెంకటరామన్, 1992లో శంకర్ దయాల్ శర్మ, 1997లో కేఆర్ నారాయణన్ లు ఉన్నారు. వీరంతా ఉపరాష్ట్రపతి పదవిని వదిలి తరువాత రాష్ట్రపతులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2007లో భైరాన్ సింగ్ షెకావత్ మాత్రం ఈ పదవిని వదిలినప్పటికీ రాష్ట్రపతిగా ఎన్నిక కాలేదు. ఇప్పుడు జగదీప్ ధనఖడ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Anshul Kamboj: టీమిండియాలోకి రంజీ స్టార్‌.. ఎవ‌రీ అంశుల్ కంబోజ్‌?

ఇక తాజా రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వ‌రలో నిర్వహించాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన 60 రోజుల్లోగా ఎన్నికలు జరగాలి. ఎన్నిక ప్రక్రియ మొదలవడానికి సమయం దగ్గరపడటంతో, రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికపై చర్చలు ప్రారంభించాయి. ఈసారి NDA, I.N.D.I.A కూటముల మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని అంచనాలు కనిపిస్తున్నాయి.

నూతన ఉపరాష్ట్రపతి ఐదేళ్ల పదవీకాలానికి ఎన్నికవుతారు. ఈ పదవికి పోటీ చేయాలంటే కనీసం 20 మంది పార్లమెంటు సభ్యుల ప్రతిపాదన అవసరం. దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిగా ఉండే ఉపరాష్ట్రపతి పదవి, రాజ్యసభ చైర్మన్‌గా కూడా కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ఈ పదవికి ఎంపికయ్యే వ్యక్తిపై రాజకీయంగా దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.