Site icon HashtagU Telugu

Chhattisgarh Encounter : కంకేర్ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోలు వీరే…

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ​(Chattisgarh) లో భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో దాదాపు 27 మంది మావోలు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, సీనియర్ శంకర్ రావు (Shankar Rao)తో సహా 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. అయితే మావోల మృతి ఫై కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా ఎంతమంది చనిపోయారు..ఎవరు చనిపోయారు..ఇంతమంది బ్రతికి ఉన్నారు..? అనేవి తెలియకపోయేసరికి మావోల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మీడియా వారు సైతం ఎవరెవరు మరణించారో తెలియజేయాలని కోరడంతో మావోయిస్టు పార్టీ చనిపోయిన వారి పేర్లను తెలుపుతూ లేఖ విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

‘మా ప్రియమైన సహచరుల పేర్లను పంపుతున్నాం. పోలీసుల ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే ప్రచారంలో ఉన్న పేర్లు సరైనవి కావు. దీంతో కొడుకులు, కూతుళ్ల విషయంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి మేము పంపిన పేర్లను మీ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాం’ అంటూ తెలిపింది.

ఇక వీరమరణం పొందిన మావోలు పేర్లు చూస్తే..

1. కామ్రేడ్ శంకర్ DVCM జిల్లా వరంగల్ (జయ శంకర్ భూపాలపల్లి) గ్రామం చల్లగరిగే.
2. బద్రు సౌత్ బస్తర్ కారెగూడెం
3. అనిత ఈస్ట్ బస్తర్ ఖోండోస్
4. వినోద్ మన్పూర్ ప్రాంతం
5. రీటా మన్పూర్ ప్రాంతం
6. రమేష్ ఓయం భైరంగడ్ గ్రామం వెచ్చం
7. బచ్ను గంగలూర్ అవకేం
8. సురేఖ గడ్చిరోలి, మిదండపల్లి
9. కవిత నెందుర్
10. రజిత ఆదిలాబాద్
11. భూమే సౌత్ బస్తర్ విలేజ్ అప్పీల్
12. కార్తిక్ వెస్ట్ బస్తర్ గ్రామం మారుమ్
13. రోషన్ దర్భా డివిజన్
14. దేవల్ గంగలూర్ గ్రామం పిడియా
15. దిను (గుడ్డు) దుర్దా
16. అన్వేష్ సౌత్ బస్తర్ ఉకుర్
17. జనీలా అలియాస్ మోడీ కొవాడి బస్తర్ కొరెంజెడ్
18. సంజిల మడ్కం బస్తర్ కరాకా
19. గీతా తకిలోడు ఇంద్రావతి
20. రాజు కురసం ప్రకేలి
21. షర్మిల ఇంద్రావతి బత్వెడ
22. సునీల ఇంద్రావతి రేకవై
23. శాంతిల నార్త్ బస్తర్ కుమ్డిగుండ
24. పింటో
25. బజ్నాత్ నార్త్ బస్తర్ వాటేకల్
26. శీలా ఇంద్రావతి ఊట్ల
27. జైనీ నార్త్ బస్తర్ చటేకల్

Read Also : AP : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెండ్