Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాను ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుతో ముడిపడిన అన్ని అంశాలపై, పాక్‌తో లింకులపై రాణాను ప్రశ్నలు అడుగుతున్నారు. ఢిల్లీలో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వేదికగా ఈ విచారణ జరుగుతోంది. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట తహవ్వుర్ రాణాను ప్రవేశపెట్టగా.. 18 రోజుల పాటు ఎన్ఐఏ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రాణాను(Tahawwur Rana) ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భారీ భద్రత నడుమ అతడిని సీజీఓ కాంప్లెక్స్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించింది. అక్కడ తహవ్వుర్ రాణా ఉండటానికి ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఆ వివరాలను తెలుసుకుందాం..
Also Read :Japan Mallareddy : జపాన్ మల్లారెడ్డి.. వేషధారణ మార్చేసి.. జపనీస్ టీ తాగేసి..
తహవ్వుర్ రాణా గది ఇలా..
- ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లోనే ఎన్‌ఐఏ భవనం ఉంది. దీని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఒక గదిని తహవ్వుర్ రాణాకు కేటాయించారు.
- ఈ గది 14 X 14 అడుగుల వైశాల్యంలో చిన్నగా ఉంటుంది.
- రాణాపై 24 గంటల నిఘా కోసం ఈ గదిలో సీసీ కెమెరాలను అమర్చారు.
- ఈ గదిలో వివిధ అంచెల్లో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
- తహవ్వుర్ రాణా పడుకోవడానికి బెడ్ వేశారు. ఆ రూమ్‌లోనే బాత్రూమ్ ఉంది.
- ఆహారం, తాగునీరు, వైద్యసదుపాయాలు అన్నీ ఆ గదిలోనే రాణాకు అందుతాయి.
- అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్లరు.
- ఈ గదిలోకి వెళ్లేందుకు కేవలం 12 మంది ఎన్‌ఐఏ అధికారులకు అనుమతి ఇచ్చారు.
- భారత్‌లో ఉన్న పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ చిట్టాను రాణా నుంచి తెలుసుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నించనుంది.
- ముంబై ఉగ్రదాడి కేసులోని మరో కీలక నిందితుడు డేవిడ్ హెడ్లీకి రాణా చాలా సన్నిహితుడు. ఇద్దరూ బాల్య స్నేహితులు. దీంతో డేవిడ్ హెడ్లీకి సంబంధించిన పూర్తి వివరాలను రాణా నుంచి రాబట్టేందుకు యత్నిస్తున్నారు.