Site icon HashtagU Telugu

Corruption Cases : పలు అవినీతి కేసుల్లో అరెస్టయిన సీఎంలు, మాజీ సీఎంలు వీరే..

Corruption Cases Ex Cm Arre

Corruption Cases Ex Cm Arre

లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam )లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలంగా మారింది. ఒకప్పుడు అవినీతి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించి మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్​, ఇప్పుడు అదే అవినీతి అరోపణలతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం ఫై అంత మాట్లాడుకుంటూ..గతంలో పలు అవినీతి కేసుల్లో (Corruption Cases) అరెస్ట్ అయినా..సీఎం (CM) లు , మాజీ (EX CM) సీఎంల గురించి కూడా ఆరా తీస్తూ..చర్చించుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో పలువురు ముఖ్యమంత్రులు (CMs) అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. అయితే వారంతా పదవి నుంచి వైదొలగిన తర్వాత జైలుకు వెళ్లారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ఆయన పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. గతంలో ఏడుగురు మాజీ సీఎంలు పలు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. వీరంతా పదవి కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయ్యారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా (బిహార్), అక్రమాస్తుల కేసులో జయలలిత(తమిళనాడు), టీచర్ నియామకాల్లో అవినీతి కేసులో ఓం ప్రకాశ్ చౌతాలా (హరియాణా), మైనింగ్ కేసులో మధుకొడా, హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్), స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుపాలయ్యారు.

1990-97 మధ్యకాలంలో దాణా కుంభకోణం కేసులో అప్పటి ఆర్జేడీ చీఫ్ లాలూతోపాటు మరొక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా జైలుపాలయ్యారు. 1991- 2016 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత మొదటిసారి 1996లో అరెస్టయ్యారు. 1989-2005 మధ్య హర్యానా సీఎంగా ఉన్న ఓంప్రకాశ్ చౌతాలా, ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి ఆరోపణలపై 2013లో దోషిగా తేలారు. మైనింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎంలు మధుకొడా (2009), హేమంత్ సోరెన్ (2024) , స్కిల్ డెవలప్ కేసులో
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యారు.

Read Also : Flying Cars: త్వ‌ర‌లోనే ప్ర‌పంచ మార్కెట్‌లోకి ఎగిరే కార్లు .. లాంచ్ ఎప్పుడంటే..?