Site icon HashtagU Telugu

Railway Pass Rules: రైల్వే పాస్‌ల జారీ.. కొత్త రూల్ అమల్లోకి

Railway Passes New Rules Disabled People Divyang People

Railway Pass Rules: రైళ్లలో ప్రయాణించే ఎంతోమంది రైల్వే పాస్‌లను వినియోగిస్తుంటారు. అలాంటి వాళ్లంతా ఒక కొత్త అప్‌డేట్ గురించి తెలుసుకోవాలి. రైల్వే శాఖ ఆన్‌లైన్‌ విధానంలో పాస్‌ల జారీ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ విధానంతో ప్రత్యేకించి దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం దక్కనుంది. వారు క్యూ లైన్లలో ఓపిగ్గా నిలబడాల్సిన అవసరం ఉండదు. అర్హులైన దివ్యాంగులు  http\\\divyangajanid.indianrail.govt.in వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి దరఖాస్తును నింపాలి. కన్సెషన్‌ సర్టిఫికెట్, సదరమ్‌ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు, దరఖాస్తుదారుడి ఫోటోలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సిద్ధం చేసుకుని అప్‌లోడ్‌ చేయాలి. దివ్యాంగుడి ఆధార్‌ నంబరు, పేరు, సెల్​ఫోన్ నంబరు, ప్రత్యామ్నాయ ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ, పూర్తి పోస్టల్‌ చిరునామా ఎంటర్ చేయాలి.

ఈ దరఖాస్తును రైల్వే అధికారులు పరిశీలించి అప్రూవల్‌ చేసిన 30 నుంచి 45 రోజుల్లోగా దివ్యాంగజన్‌ రైల్వే రాయితీ ఫొటో గుర్తింపు కార్డు ప్రింట్ అయి, సమీప రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ సమాచారాన్ని లబ్ధిదారుడికి(Railway Pass Rules) ఫోన్‌ చేసి తెలియజేస్తారు. దివ్యాంగులు తమ పాత రైల్వే పాస్‌లను ఇదే పద్ధతిలో రెన్యూవల్ చేసుకోవచ్చు. ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌ పాస్‌ ఐడీ కార్డు పొందొచ్చు. రైల్వేశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌లో దివ్యాంగులు ఈ-టికెట్లను కూడా బుక్‌ చేసుకోవచ్చు.