Site icon HashtagU Telugu

Delhi : రష్యా నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు కలకలం..!!

Indian Aviation History

Indian Aviation History

రష్యా రాజధాని మాస్కో నుంచి వస్తున్న విమానంలో బాంబు కలకలం రేపింది. ఫ్లైట్ లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో…అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అయితే విమానంలో సిబ్బంది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. వార్తా సంస్థ ANI ప్రకారం, శుక్రవారం ఉదయం రష్యాలోని మాస్కో నగరం నుండి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కలకలం రేగింది. వెంటనే ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో తెల్లవారుజామున 3.20 గంటలకు విమానం ల్యాండ్ అయింది.

అయితే విమానంలో బాంబు ఉన్నట్లు ఎవరు సమాచారం ఇచ్చారో ఢిల్లీ పోలీసులు వెల్లడించలేదు. విమానంలో బాంబు ఉందని సమాచారం అందించిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఫ్లైట్ లో బాంబు ఉందని తెలిసిన వెంటనే అందులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులందరినీ సురక్షితంగా దించారు. విమానంపై దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ అధికారిక ప్రకటనలో తెలిపింది. విమానంలో బాంబు ఉందన్న విషయంపై ఢిల్లీ పోలీసులు కాసేపట్లో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.